తెలుగు మాసాలలో అయిదవ మాసమైన శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత మరియు విశిష్టత ఉంది. ప్రధానంగా మహిళలు ఈ మాసమును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమే. నిత్యం దీప దూప నైవేద్యాలతో హిందువులు పూజలు చేస్తుంటారు.  అయితే కష్టాలు, బాధలతో సతమతమవుతున్న వారు ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు గురువారాలు కనుక రెండు పనులు చేస్తే శని భాద నుండి విముక్తి కలిగి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు మీ ఇంట వెల్లి విరుస్తాయని శాస్త్రాలను చదివిన పండితులు చెబుతున్నారు. అయితే ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చే గురు వారాలలో ఏమి చేస్తే మన ఇంట సిరుల పంట పండుతుంది అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణ మాసంలో వచ్చేటటువంటు నాలుగు గురువారాలు ఆవుకు బెల్లంతో కలిపిన శనగలు  తినిపించాలి. బుధవారం రాత్రి 300 గ్రాములకు తగ్గకుండా శనగలను నానబెట్టుకోవాలి. గురువారం నాడు పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రపరచుకుని 6.30 గంటల లోపే పూజను ముగించాలి. అలా తినిపించే ముందు గోమాతను పసుపు కుంకుమలతో, పూలతో అలకరించి సాక్షాత్తు అమ్మవారి స్వరూపముగా భావించి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుని కరుణించమని వేడుకోవాలి. అనంతరం నానబెట్టిన శనగలను ఏడు లోపల ఆవుకు తినిపించాలి. ఇలా చేయడం వలన గురుబలం పెరిగి అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

అదే విధంగా శనగలను ఒక కేజీ పావు తీసుకుని, దాంతో పాటుగా 21 రూపాయలను కలిపి పసుపు గుడ్డలో కట్టి ఆ మూటను పూజలో ఉంచి పూజ అయిన అనంతరం...ఆ మూటను మరియు మూడు రకాల పళ్ళను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి.... అంతా మంచే జరుగుతుంది. అయితే ఈ విధంగా శ్రావణ మాసంలోని నాలుగు గురువారాలు కూడా చేయాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: