చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు, ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. కొత్త బట్టలు ధరించడం వలన మనస్సులో పాజిటివిటీ ఏర్పడుతుంది. ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అయితే కొత్త బట్టలు, ఆభరణాలు ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు అని తెలుసా ? ఎందుకంటే కొన్నిసార్లు ఈ కొత్త విషయాలు అశుభం కావచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఎప్పుడైనా షాపింగ్‌కి వెళ్లాలనుకుంటే శుక్రవారం బెస్ట్. ఎందుకంటే శుక్రుడు సంపద, సంతోషం, బట్టలకు కారణమైన గ్రహం అని భావిస్తారు. ఈ రోజున బట్టలు మొదలైనవి కొనుగోలు చేయడం కూడా శుభప్రదం.

కొత్త బట్టలు ఎప్పుడు కొనాలి ?
శుక్రవారం బట్టలు కొనే వారికి నష్టం ఉండదు. అయితే శని, ఆదివారాల్లో కొత్త బట్టలు అస్సలు కొనొద్దు. మంగళవారాలు, శనివారాలు కొత్త బట్టలు ధరించడం చాలా అశుభంగా భావిస్తారు. బుధవారం, గురువారం, ఆదివారం, సోమవారం కొత్త బట్టలు ధరించవచ్చు. ఇది చాలా శుభప్రదమైనది.

నగలు ఎప్పుడు కొనాలి ?
మీరు నగల షాపింగ్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్నారా ? లేదా కొత్త ఆభరణాలు ధరించడానికి ప్రత్యేక సందర్భం కోసం ఎదురు చూస్తున్నారా ? దీనికి కూడా ఒక శుభ దినం ఉంది. బట్టలు, నగలు ధరించడానికి, కొనడానికి శనివారం అశుభం. ఆదివారం, సోమ, బుధ, గురు, శుక్రవారాలు అత్యంత పవిత్రమైన రోజులు.

ఎప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి ?
విచారంగా ఉంటే గులాబీ లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించండి. అలాగే విజయం కోసం పసుపు రంగును ధరించండి. బట్టలపై సిరా, మసి, మట్టి, పేడ మొదలైనవి ఉంటే అస్సలు కొనకండి. అది అశుభం.

అలాంటి నగలు ధరించవద్దు
కొత్త ఆభరణాలు విరిగితే అశుభం. చిరిగిన, కాలిపోయిన బట్టలు ధరించవద్దు. ఎందుకంటే అలాంటి దానిని ఇది రాహు నివాసం అని నమ్ముతారు. అంతే కాకుండా కొత్త బట్టలు ఉతకకుండా ధరించడం వల్ల బుధ గ్రహం మీపై అశుభ ప్రభావం చూపుతుంది. పుష్య నక్షత్రంలో కొత్త బట్టలు ధరించడం వల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఉత్తర ఫల్గుణి ఆదాయం పెరుగుతుంది, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయట పడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: