మీరు ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టమో, వేటిని చూస్తే దురదృష్టమో దరిద్రము కలుగుతుందో లక్ష్మీ కటాక్షాన్ని ముందుగానే తెలిపే వాటి గురించి మనం తెలుసుకుందాం..?  ఎవరైనా సరే తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిందే  చాలామంది రాత్రి నిద్రించే ముందు ఒక్కోసారి కాళ్ళు కడుక్కొని తడి కాళ్లతో నిద్రపోతారు. కాళ్లు తడిగా ఉండి నిద్రపోతే మాత్రం దరిద్ర దేవత మనతో ఉన్నట్టే. కాబట్టి తప్పనిసరిగా పొడి కాళ్లతో  నిద్రపోవాలి.

అలాగే పొద్దున నిద్ర లేవగానే ఎప్పుడైనా సరే మనం ఎదుటి వాళ్ల పాదాలను మాత్రం చూడకూడదు. అలా చూస్తే మాత్రం మీకు దరిద్రం చుట్టుకున్నట్టే . ఉదయం నిద్రలేవగానే ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి అరచేతులను చూసుకోవాలి. అలా చూస్తే మీకు లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే నిద్ర లేవగానే జుట్టు మొత్తం విప్పుకొని ఉన్నటువంటి మహిళలను చూడరాదు. అలా చూసినా దరిద్ర దేవత తాండవిస్తుంది. అలాగే నిద్ర లేవగానే చెప్పులు, చెత్త బుట్ట,
 వీటిలో ఏది చూసినా దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది. అలాగే నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే కూడా చాలా మంచిది. మరో ముఖ్య విషయం ఏంటంటే నిద్ర లేవగానే పగిలిన అద్దాన్ని కూడా చూడకూడదు. పగిలినటువంటి అద్దం చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురౌతాయి. చెత్త చూసినా చెప్పులు, గొడవ పడుతున్నటువంటి వ్యక్తులను చూస్తే మానసిక అశాంతి కలుగుతుంది. ఆ రోజంతా ఏ పని చేసిన మనకు కలిసి రాదు. అలాగే ఉదయం నిద్రలేవగానే ఎవరైనా సరే అగ్ని చూస్తే చాలా మంచిది. గోవు తోక భాగం చూస్తే ఇంకా మంచిది. ఎవరైనా సరే నెయ్యి, పెరుగు, తేనే  చూస్తే మాత్రం విపరీతమైన  ఆదాయం పెరుగుతుంది. అలాగే పూలను చూసినా, పూలను తాకిన  ఆ రోజంతా ఆదాయపరంగా బాగా కలిసి వస్తుంది.


మరీ ముఖ్యంగా మనం నిద్ర లేవగానే మనం ముందుండే  అరచేతిలను చూసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత  మిగతా వస్తువులు ఏవైనా చూడండి. ఈరోజు మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది డబ్బు కూడా వస్తుందని ఉందంటే ఆరోజు మాత్రం మీకు కొబ్బరికాయ కనిపిస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేచి బయటకు రాగానే ఏదైనా తెల్లటి పక్షి కనిపిస్తే మాత్రం తొందర్లోనే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని దానికి సంకేతం. అలాగే నిద్ర లేవగానే గడ్డి మేస్తున్నటువంటి ఆవు కనిపించినా కానీ తొందర్లోనే మీకు ఆదాయం రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇలా ఉదయం నిద్ర లేవగానే కొన్ని చూస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: