సమాజంలో ఎవరైనా సరే వారి యొక్క చేతి కాళ్ల గోర్లు పెరిగితే ఎప్పటికప్పుడు తీసి వేస్తూ ఉంటారు. మరి ఆ గోర్లను ఎప్పుడు ఎక్కడ తీసివేయాలి అనేది మనం ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం. ముఖ్యంగా ఈ సమయాల్లో ఈ రోజులలో మన గోర్లను కత్తిరించాలి మరి అది ఎప్పుడో తెలుసుకుందామా..! చాలామంది పిల్లలు గోర్లు తీసుకుంటుంటే పెద్ద వారు ఇంట్లో తీసుకోకూడదని అంటూ ఉంటారు. దీంతో పిల్లలు ఇంట్లో ఎందుకు తీసుకోకూడదు

 బయట తీసుకోవచ్చా. కారణం ఏమిటి అని నిలదీసి  అడుగుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో ముఖ్యంగా లివింగ్ రూమ్, సోఫా, వంటగది అందరూ తిరిగే ప్లేస్ లో గోళ్లను అస్సలు తియ్యకూడదు. ఇలా ఈ ప్రధానమైన స్థలాల్లో గోర్లు కత్తిరించుకోకూడదు జుట్టు అయితే అసలు కత్తిరించు  కోకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. మనం గోర్లు తీసుకునేటప్పుడు అది అపార్ట్ మెంట్ లో ఉన్న వారు గాని, ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్నటువంటి వారి కానీ గోర్లను మనం శుభ్రం చేసుకునే సింకు దగ్గర లేదా బాత్ రూమ్ దగ్గర కానీ తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు. ఎందుకంటే గోర్లు అనేవి విషతుల్యంతో కూడుకున్నవి కాబట్టి వాటిని మనం తిరిగే ప్రదేశంలో గాని, తియకూడదని చెబుతున్నారు. అలాగే చాలామందికి గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. గోర్లు కొరికి కొంతమంది తింటూ ఉంటారు.  దీనివల్ల విష ప్రభావం అనేది అప్పటికప్పుడు చూపించకుండా కొద్దిరోజుల తర్వాత చూపించవచ్చు. కొంతమంది ఇంట్లో వద్దంటే పక్కింట్లో చేసుకోవచ్చ అని అడుగుతూ ఉంటారు. వాస్తవంగా పూర్వకాలం నుంచి పెద్దలు కొన్ని సంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ వాటిని మనం ఫాలో అవుతాం. వాటి వెనుక ఏదో ఒక కారణం లేకుండా వారు మాత్రం పాటించరు. ఇలాంటి వాటిని ప్రస్తుతం ఉన్న కాలంలో మూలనపడేస్తూ వెటకారాలు చేస్తూ ఉంటారు. సంప్రదాయాల విషయంలో వెటకారాలు చేయడం మంచిది కాదని అంటున్నారు.

 సాధారణంగా మనం తినే ప్రదేశంలో, పడుకునే ప్రదేశంలో, తిరిగే ప్రదేశంలో గోర్లను  కత్తిరించరాదు. ఇందులో మరొక ట్విస్ట్  కూడా ఉంది. గోర్లను శుక్రవారం మరియు మంగళవారాల్లో అసలు తీయకూడదు. ఇందులో వెంట్రుకలు కానీ ఇంకా ఏదైనా పనులు కానీ శుక్రవారం మంగళవారం మనం చేయం. మరి గోర్లు ఏ సమయంలో తీయాలంటే పౌర్ణమి మరియు అమావాస్య వచ్చిన తెల్లారి మనం గోర్లు కానీ షేవింగ్ కానీ తీసుకోవలసిన సమయంగా భావిస్తారు. కాబట్టి మనం ఎంతో కాలం నుంచి వస్తున్న సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు  తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: