పూర్వం నుంచే చాలామంది ఉంగరాలను ధరించడం అలవాటుగా వుంది. కొంతమంది ముత్యాలు, పగడాలు వంటివి ఇంకొంతమంది జాతకం అనుసరించి నవరత్నాలను మరియు ఇంకొంతమంది వారికి ఇష్టమైన దేవతలను బంగారు వెండి తయారు చేయించుకొని మరి ధరిస్తుంటారు. కొన్ని రకాల ఉంగరాలు కేవలం కుడి చేతికి మాత్రమే ధరించాలి. ధరించుకోవచ్చు కొన్ని ఉంగరాలు ఎడమ చేతికైనా ధరించుకోవచ్చు. ఉంగరాలు ఏ చేతికి ధరించాలో, వాటిని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలో అవగాహన ఉండదు.మరియు కొంతమంది కొన్ని సమయాల్లో దేవత విగ్రహాలు ఉన్న ఉంగరాలు ధరించడం వల్ల పవిత్రతకు దారితీస్తుందని వేద పండితులు హెచ్చరిస్తున్నారు. వారు ఎలాంటి వారు దేవతామూర్తులు ఉన్న ఉంగరాలు ధరించకూడదో ఇప్పుడు చూద్దాం..

1. కొంతమంది జన్మదహ దోషాలను పోగొట్టుకోవడానికి మరియు నాగ సర్ప దోషాలను పోగొట్టుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని రకాల ఉంగరాలను ధరిస్తారు. ధరించాలి అనుకున్న వారు ఆ ఉంగరాలను పాలతో శుద్ధి చేసుకుని ధరించడం చాలా ఉత్తమం.

2. ఇక స్త్రీలు ఎక్కువగా రుతుక్రమణ సమయంలో మెడలో కానీ,వేళ్ళకు కానీ దేవతా ప్రతిమలున్న ఉంగరాలను, గొలుసులను వాడకూడదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లోపంతో వాడినా, ఆ సమయం తర్వాత ఉంగరాలను, గొలుసులను ఆవు పాలతో శుద్ధి చేసుకుని వేసుకోవడం వల్ల, దేవతామూర్తులు అపవిత్రం కాకుండా ఉంటారు.

4. అలంకరణ కోసం వాడే ఉంగరాలు, గొలుసులను తయారు చేయించుకున్న సరే వాటిని ఆలయాల్లో తగిన పూజలు చేయించి మరీ వేసుకోవాలి.

5.మాంసం తినే చేతిలో దేవతా విగ్రహాలు ఉన్న ఉంగరాలను ధరించకూడదు.మరియు మనం తినేటప్పుడు ఎంగిలి కూడా అంటకూడదు.ఇలా అంటడం మహా పాపంగా భావించాలని పెద్దలు చెబుతున్నారు.

6.అబద్దాలు చెప్పేవారు, మరియు మందు,సిగరెట్ అలవాట్లున్న వారు కూడా  ఇలాంటి ఉంగారాలను ధరించకపోవడమే చాలా మంచిది.మరియు ఒకవేళ చేతికి పెట్టుకున్న ఉంగరాన్ని కళ్ళకు అద్దుకునేటప్పుడు మన చేతిని ముడుచుకుని మరీ మొక్కుకోవాలి.ఇలా చేయడం వల్ల,ఉంగరాలు పవిత్రతను కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: