పూర్వం నుంచి సంప్రదాయంలో ఒక భాగంగా కొన్ని పద్ధతులను,ఆచార వ్యవహారాలను మనం నమ్ముతూ వస్తున్నాం.పశుపక్ష్యాదులకు పూజలు చేయడం,కొన్ని ఆహార పదార్థాలను పవిత్రంగా చూడటం,మొక్కలను పూజించడం వంటివి మన పూర్వీకుల నుంచి మనం మనం నేర్చుకున్నవే.వీటివల్ల మనకు ధనలాభం ఎంత కలుగుతుందో తెలియదు కానీ,మనసుకు ప్రశాంతత మాత్రం అందుతుందని పురాణాలు కూడా చెబుతున్నాయి.సాధారణంగా ఇరుగుపొరుగు అన్న తర్వాత కొన్ని వస్తువులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాము.కానీ కొన్ని నమ్మకాల ప్రకారం కొన్ని వస్తువులను ఇతరులు చేతికి అసలు అందివ్వకూడదని పెద్దలు చెబుతుంటారు.ఆ వస్తువులేంటో,వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఉప్పు..

సాధారణంగా ఉప్పుకు మన సాంప్రదాయాలలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.ఉప్పు రుచికే కాక,చాలా పూజా కార్యక్రమాలలోనూ మరియు దిష్టి తీయడానికి కూడా వాడుతుంటారు.అలాంటి ఉప్పును ఒకరి నుంచి ఇంకొకరు స్వయంగా చేతికి అస్సలు ఇవ్వకూడదని పెద్దలు చెబుతున్నారు.దీనివల్ల వారి మధ్య గొడవలు పెరిగే అవకాశం ఉందని,ఉప్పు ఇచ్చిన వారి ఇంట్లో ఆర్థికనష్టాలు చవి చూస్తారని హెచ్చరిస్తూ  వున్నారు.ముఖ్యంగా ఉప్పును అరిచేతిలో అసలు వేయకూడదట.దానితో మన అరచేతిలో ఉన్న లక్ష్మీదేవి నిలవకుండా,ఇతర పాలవుతుందని చెబుతున్నారు.

 చీపురు..

మన హిందూసాంప్రదాయాలలో చీపురుకు కూడా ప్రత్యేక స్థానం ఉంది.దీనిని కొన్నిప్రదేశాల్లోనే  ఉంచడం, చీపురును దాటకుండా ఉండడం,చీపురును తొక్కకూడదు వంటి సాంప్రదాయాలను మనం పాటిస్తూనే ఉంటాము.అదే చీపురుని ఒకరి చేతి నుంచి మరొకరు అస్సలు తీసుకోకూడదట.దీనివల్ల వారిద్దరూ ఎంత స్నేహంగా ఉన్నారో,అంత శత్రువులుగా మారుతారని చెబుతున్నారు.కావున ఒకరి చేతి నుంచి ఇంకొకరు చీపురు అస్సలు తీసుకోకండి.ముఖ్యంగా ఆడబిడ్డలు వారి పుట్టింటి నుంచి చీపురు అస్సలు తీసుకుపోకూడదు.దీనివల్ల వారి పుట్టింటికి వారికి మధ్య తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.

చింతపండు..

చింతపండును కూడా లక్ష్మీదేవి ప్రతిరూపంగా చూడడం మన హిందూ సంప్రదాయంలో ఒక భాగమే.కచ్చితంగా మన ఇళ్లల్లో ఎప్పటికీ అయిపోకుండా నిల్వ ఉంచుకోవాల్సిన వస్తువుల్లో చింతపండు కూడా ఒకటి. ఇలాంటి చింతపండుని ఒకరి చేతితో ఇంకొకరితో అస్సలు తీసుకోకూడదు.దీనివల్ల ఇంట్లో అశాంతి,ఆర్థిక తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: