సోమవారం జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కన్నుల పండగగా, సంబరాలు అంబరాన్ని అంటేలా జరిగాయి.దేశమంతా ఒక్కటై బాల రాముని ప్రతిష్టించగానే,నిజమైన దేవుడే మన కోసం వచ్చాడని,త్రేతా యుగంలో అయోధ్యను విడిచిన రాముడు,కలియుగంలో తన ఇంటికి తాను చేరుకొని మన భారతదేశాన్ని అనంత పుణ్యభూమిగా తయారు చేశాడని,ప్రతి ఒక్కరూ ఆనందంతో పండుగ చేసుకున్నారు.కానీ ఈ వేడుకకు దేశమంతా వచ్చి ఏకంగా చూడలేరు అని చెప్పి,ప్రతి రామభక్తునికి రాముని యొక్క ఆశీస్సులను కలిగించాలని,మన ప్రధానమంత్రి అయిన మోడీగారు అందరికీ రామమందిర అక్షింతలు ప్రతి ఇంటికి పంచి పెట్టాలనే గొప్ప కార్యాన్ని తలపెట్టారు.రామ జన్మభూమి అయోధ్య నుంచి అక్షింతలు మన దేశములోని ప్రతి ఒక్క రాష్ట్రానికే కాక ప్రతి చిన్న పల్లెలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి చేరాయి. అలాంటి కార్యక్రమం ఎప్పుడు కనివిని ఎరుగము.

అయోధ్య నుంచి పంపించిన అక్షింతలను ప్రతి ఒక్కరు ఎంతో గొప్ప వరంగా భావించి,తమ పూజ గదుల్లో ఉంచి పూజించారు.జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరగగానే,ప్రతి ఒక్కరూ రామునికి పూజలను అందించి అక్షింతలను తలపై వేసుకొని రాముని యొక్క కృపకు లోనయ్యారు.కానీ అయోధ్య నుంచి వచ్చిన ఈ అక్షింతలు కొన్ని మిగిలిపోయి ఉంటాయి.అలా మిగిలిన అక్షింతలను ఏం చేయాలో, ఏమి చేస్తే మంచి జరుగుతుందోనని తెగ ఆలోచిస్తున్నారు.అలాంటి వారందరికీ వేద పండితులు కొన్ని సందర్భాలలో అక్షింతలు ఉపయోగించడం వల్ల రాముని యొక్క ఆశీర్వాదం కలుగుతుందని సూచించారు.అవేంటో మనము తెలుసుకుందాం పదండి..

ఇలా వచ్చిన అయోధ్య అక్షింతలకు ఇంట్లో వాడే సాధారణ అక్షింతలతో కలిపి దేవుడి మందిరంలో కానీ, డబ్బులను ఉంచే బీరువా వంటి ప్రదేశాల్లో కానీ ఉంచాలి. వాటికి ఎలాంటి దోషాలు తాకకుండా జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.ఈ అక్షింతలను పెద్దలు ఆశీర్వాదం కోసం వచ్చిన,పిల్లలను ఆశీర్వదించేటప్పుడు రామ మందిర అక్షింతలతో ఆశీర్వదిస్తే,వారిలో పురోభివృద్ధి జరుగుతుందని,మరియు వారికి మంచి జరుగుతుందని తెలిపారు.మరియు పుట్టిన రోజులు,పెళ్లి రోజు,ఇతర శుభకార్యాలకు,ఏదైనా పెద్ద కార్యం తలపెట్టినప్పుడు,ఉద్యోగ ప్రమోషన్ వంటి సందర్భాల్లో శ్రీరాముని తలుచుకొని వేసుకోవడంతో వారు అనుకున్న పనులు సజావుగా జరుగుతాయని సూచించారు.

మీ ఇంట్లో కూడా తప్పకుండా అయోధ్య అక్షింతలు మిగిలే ఉంటాయి.మీరు కూడా ఇలాగే చేసి రాముని యొక్క కృపకు లోనుకండి.

మరింత సమాచారం తెలుసుకోండి: