మనకు మనసు బాగోలేకపోయినా.. మనకి ఏదైన ఇబ్బంది కలిగిన.. మన మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకున్న మొదట గుర్తు వచ్చేది గుడి. అక్కడ దొరికే ప్రశాంతత మరెక్కడ దొరకదు. ఒక్కోక్కరు ఒక్కో దేవుడిని ఇష్టపడుతూ ఉంటారు. నమ్ముతూ ఉంటారు. కాగా మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిందే . ఎక్కడ ఎక్కడ నుంచో జనాలు షిరిడి సాయిబాబాని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు.


దేశ విదేశాల నుంచి కూడా షిరిడి సాయిబాబాను దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో జనాలు తరలి వస్తూ ఉంటారు . కాగా ఇండియా - పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వార్ అందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇలాంటీ మూమెంట్ లోనే కొందరు బాంబు బెదిరింపు మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. ఇదే  నేపథ్యంలో సాయిబాబా మందిరానికి బెదిరింపు మెయిల్ వచ్చింది . ఈ క్రమంలోనే టెంపుల్ యాజమాన్యం తగు భద్రతా చర్యలు తీసుకుంటూ కొన్ని సంచలన రూల్స్ ని తీసుకొచ్చింది.



ఆలయంలోకి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరిని ముందుగానే తనిఖీ చేస్తారు  సెక్యూరిటి టీం. అయితే ఇప్పుడు ఒకటికి మూడుసార్లు తనిఖీ చేసే విధంగా కొత్త ఏర్పాట్లు చేశారట . అంతేకాదు ఆలయంలోకి వచ్చే భక్తులు పూలదండలు.. ప్రసాదం కొబ్బరికాయలను తీసుకురావద్దు అని సాయిబాబా సంస్థ సభ్యులు చెప్తున్నారు.  అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఎటువంటి అనుమానస్పద విధంగా మనుషులు కనిపించిన అనుమానస్పద సిచువేషన్ అని అనిపించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సాధారణంగానే షిరిడి సాయిబాబా టెంపుల్ లో హై సెక్యూరిటీ ఉంటుంది.  కాగా ఇప్పుడు ఇలాంటి ఒక బెదిరింపు మెయిల్ రావడం .. పైగా అదే సమయంలో ఇండియా - పాకిస్తాన్ ల మధ్య సిచువేషన్ అసలు బాగోకపోవడంతో టెంపుల్ యాజమాన్యం సెక్యూరిటీని ఇంకా కట్టూధిట్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: