
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం శనివారం ఆరు రకాల ధాన్యాలను దానం చేయడం వల్ల జీవితంలో కొన్ని అడ్డంకులు తొలగిపోయి ప్రశాంతంగా సుఖసంతోషాలతో జీవిస్తారట . అందులో మొదటిది గోధుమలు. గోధుమలు దానం చేయడం శనివారం చాలా చాలా మంచిది అంటున్నారు పండితులు . అదే విధంగా వరి , శనగలు , మొక్కజొన్న.. మినుములు.. జొన్నలు దానం చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది అని వాళ్లకి ఏవైనా కష్టాలు ఉంటే తొలగిపోతాయి అని కూడా చెబుతున్నారు .
నల్ల నువ్వులను శనివారం పేదలకి లేదా అవసరమైన వారికి దానం చేయడం ద్వారా శని వదిలిపోతుంది అని ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారని కూడా చెబుతున్నారు. అంతే కాదు శనివారం ఆవు నూనె దానం చేయడం ద్వారా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయట . శని దేవుడు బాగా సంతోషిస్తాడట . శనివారం నాడు ఇనుప పాత్రలు దానం చేయడం వల్ల ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని కూడా పండితులు చెబుతున్నారు. అయితే శనివారం ఇనుము అస్సలు కొననే కొనకూడదు అంటున్నారు పండితులు. కొంతమంది ఇలా శనివారం దానాలు చేయడం ద్వారా బిడ్డల ఆయుష్షు కూడా పెరుగుతుంది అని .. వాళ్ళు ఏవైనా దోషాలు చేసిన మొత్తం తొలగిపోతాయి అని చెప్తున్నారు..!!
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కొందరు పండితులు కొందరు పెద్దలు చెప్పిన ప్రకారంగానే అందించబడింది . ఇది ఖచ్చితమైన పరిహారం అని చెప్పలేము . కొందరు శాస్త్ర నిపుణుల సూచన ప్రకారమే ఈ సమాచారాన్ని అందించడం జరిగినది . వీటిని పాటించడం అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని పాఠకులకు గుర్తుంచుకోవాలి..!!