తెలుగు సంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కానీ, మార్గశిర మాసంలో వచ్చే పున్నమికి ఉన్న పవర్‌, దాని చుట్టూ అల్లుకున్న పురాణ గాథలు వేరే లెవెల్! ఈ పౌర్ణమిని మామూలుగా ‘నరక పౌర్ణమి’ లేదా అత్యంత శక్తివంతమైన ‘కోరల పున్నమి’గా పిలుస్తారు. ఈ ఒక్క రోజు చేసే చిన్న ఆరాధన, కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక రక్షణ కల్పిస్తుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి!


యముడి కోరలు తెరచుకునే రోజు!

హిందూ పురాణాల ప్రకారం, కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మ రాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడట! దీని అర్థం- ఈ సమయంలో యముడు భూలోకంలోని భక్తులపై కరుణ చూపుతాడని, వారి కర్మ ఫలాలను పక్కకు నెట్టి, సకల వ్యాధులు, అనారోగ్య సమస్యలను తన కోరల శక్తితో తొలగిస్తాడని ప్రగాఢ నమ్మకం. ఈ అపమృత్యు భయాన్ని తొలగించినందుకు కృతజ్ఞతగా మార్గశిర పౌర్ణమి రోజున యమధర్మరాజును ప్రత్యేకంగా పూజిస్తారు.



చిత్రగుప్తుడి సోదరి ‘కోరలమ్మ’

ఈ పౌర్ణమికి ‘కోరల పౌర్ణమి’ అనే పేరు రావడానికి ముఖ్య కారణం- ఈ రోజున యమధర్మరాజు ఆస్థానంలోని చిత్రగుప్తుడి సోదరి ‘కోరలమ్మ’ను పూజించడం! చిత్రగుప్తుడు ఈ రోజు తన చెల్లెలు కోరల ఇంటికి విందు కోసం వస్తాడు. అందుకే, కోరలమ్మను పూజిస్తే.. ఆమె ద్వారా చిత్రగుప్తుడి అనుగ్రహం, తద్వారా యముడి శాంతం లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా, ఈ రోజున కోరలమ్మను ఆరాధించిన వారికి నరక బాధలు తొలగిపోతాయి, అపమృత్యు భయాలు దరిచేరవు.



మినప రొట్టె రహస్యం, శునకానికి నైవేద్యం!

కోరల పౌర్ణమి రోజున ఆచరించాల్సిన అత్యంత విశేషమైన ఆచారం ఒకటుంది. ఆ రోజున మినప రొట్టెలు (కుడుములు) తయారుచేసి, ఆ నైవేద్యాన్ని తల్లి కోరలమ్మకు సమర్పిస్తారు. ఆ తర్వాత, ఆ రొట్టెలో నుంచి ఒక చిన్న ముక్కను కొరికి, శునకాలకు వేస్తారు.శునకం సాక్షాత్తు కాలభైరవుడి వాహనం. యమధర్మరాజుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అందుకే, శునకానికి నైవేద్యం పెట్టడం ద్వారా కాలభైరవుడి అనుగ్రహం లభించి, సమస్త దరిద్రాలు, దోషాలు నివారించబడతాయి. కోరల పౌర్ణమి రోజున ఈ చిన్న ఆచారాన్ని పాటిస్తే.. అనారోగ్య భయం పోయి, ఆ ఇంటిపై కోట్ల వర్షం కురుస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే, ఈ శక్తివంతమైన పౌర్ణమిని ఎవ్వరూ మిస్ చేసుకోరు!



మరింత సమాచారం తెలుసుకోండి: