ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతోమంది దిగ్గజ క్యాప్టెన్లు  ఉన్న విషయం తెలిసిందే. జట్టును ముందుండి నడిపించడంలో తమదైన వ్యూహాలతో ఎన్నో విజయాలను జట్టుకు అందించి దిగ్గజ కెప్టెన్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. కాగా ఇలాంటి దిగ్గజ క్యాప్టెన్ లలో  ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లు కూడా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కెప్టెన్సీలో ఆడిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ తాజాగా ఈ ఇద్దరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా రికీ పాంటింగ్ కంటే కెప్టెన్సీ విషయంలో ధోనీ మెరుగ్గా ఆలోచిస్తాడు అంటూ మైఖేల్  హస్సి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ చాట్ లో పాల్గొన్న మైఖేల్  హస్సీ ... తన కెరీర్లోని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.

 

 

 అయితే ప్రపంచ దిగ్గజ క్యాప్టెన్ లో ఒకరైన రికీ పాంటింగ్ సారథ్యంలో మైకేల్ హస్సీ 2007 ప్రపంచ కప్ తో పాటు 2006, 2009 ఛాంపియన్ ట్రోఫీ లు కూడా ఆస్ట్రేలియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా రికీ పాంటింగ్ కెప్టెన్సీ లో ఎన్ని మ్యాచ్ లలో  ఆడాడు మైఖేల్  హస్సీ . అదే సమయంలో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో టైటిల్ గెలవడం లోనూ ధోనీ సారథ్యంలో మైఖేల్  హస్సీ  ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే దిగ్గజ కెప్టెన్లు అయిన రికీ పాంటింగ్ మహేంద్రసింగ్ ధోని ఇద్దరిలో ఒక బెస్ట్ కెప్టెన్ ఎంపిక చేసుకుంటే ఎవరిని చేసుకుంటారు అని ప్రశ్నకు  మైకేల్ హస్సీ ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. 

 

 

 

 నా దృష్టిలో అయితే ఇద్దరు కెప్టెన్లు అత్యుత్తమ కెప్టెన్లే  అంటూ తెలిపిన మైఖేల్  హస్సీ . నాయకత్వ విషయాల్లో మాత్రం ఇద్దరికీ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుందని ఎంతో వ్యత్యాసాలు కనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు. ముందుగా రికీ పాంటింగ్ విషయానికి వస్తే అతనికి నాయకత్వం వహించడం అంటే  ఎంతో ఇష్టమని అలాగే గెలుపంటే మరింత ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రతి  విషయంలో రికీ పాంటింగ్ ఖచ్చితత్వాన్ని కోరుకుంటాడు అంటూ తెలిపాడు. ఒక జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా తానే ముందుండి ఆ కష్టాన్ని ఎదుర్కొని జట్టు ఆటగాళ్లు అందరికీ ఎక్కడ ఒత్తిడి లేకుండా చూసుకుంటాడు. అటు ధోనీ కూడా అలాంటిదే చేస్తూ ఉంటాడు...మ్యాచ్  ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఎలాంటి భావోద్వేగానికి లోన కాకుండా ఎంతో కూల్ గా  నిర్ణయాలు తీసుకుంటాడు ధోని . వికెట్ల వెనుక నుండి బౌలర్లు  ఒత్తిడికి లోను కాకుండా ఎన్నో సలహాలు సూచనలు ఇస్తారు. కొన్ని కొన్ని సార్లు ధోని తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి కానీ ఆ నిర్ణయాలు తప్పక పనిచేస్తాయి అంటూ చెప్పుకొచ్చాడు.

 

 

 

ధోనికి తనపై తన నిర్ణయాలపై ఎక్కువ నమ్మకం ఉంచుతాడు అందుకే ప్రతి విషయంలో సక్సెస్ అవుతారు. అందుకే ఒక కోణంలో చూసుకుంటే రికీ పాంటింగ్ కంటే మహేంద్రసింగ్ ధోని బెస్ట్ కెప్టెన్ అని చెప్పవచ్చు అంటూ మైకెల్ హస్సీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: