క‌శ్మీర్ విష‌యంలో అవాకులు చెవాకులు పేలిన పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ ఆఫ్రిదిపై టీం ఇండియా క్రికెట‌ర్లు మండిప‌డుతున్నారు. ఆఫ్రిది మాట‌ల‌ను కోట్స్ చేస్తూ గూబ‌గూయ్యిమ‌నేలా కౌంట‌ర్ ఇస్తున్నారు.  పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)పై పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది మరోసారి త‌న  వక్రబుద్ధిని ప్ర‌ద‌ర్శించ‌డం మొద‌లుపెట్టాడు. రెండు రోజుల క్రితం పీవోకేలో ప‌ర్య‌టించిన ఆఫ్రిది అక్క‌డి వారిలో విద్వేషం రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. కశ్మీర్‌ జట్టును పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఆడటానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కి విజ్ఞప్తి చే స్తూ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విజ్ఞ‌ప్తి చేశాడు. 


మ‌రో అడుగు ముందుకేసి పీఎస్‌ఎల్‌లో కశ్మీర్‌ పేరిట ఒక ఫ్రాంచైజీ ఉండాల‌ని, పీఎస్‌ఎల్‌ సీజన్‌ నాటికి కశ్మీర్‌ టీమ్‌ను ఏర్పాటు చేయాల‌ని, ఆ జ‌ట్టుకు తానే నాయ‌క‌త్వం వ‌హించాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు. అంత‌కు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది.. పీవోకే విష‌యంలోనూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంపై భార‌తీయులు కాస్త ఘాటుగానే స్పందించారు. ప్ర‌పంచం మొత్తం మారినా మీ వ‌క్ర‌బుద్ధి మార‌దూ అంటూ తిట్టిపోస్తున్నారు.  ఓ వైపు ప్రపంచమంతా మహమ్మారి కరోనా వైరస్‌ను అరికట్టడానికి అవిశ్రాంతంగా పోరాడుతుంటే పాకిస్తాన్‌ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోందంటూ తిట్టిపోస్తున్నారు.


ఇదిలా ఉండ‌గా ఆఫ్రిది వ్యాఖ్య‌ల‌పై  ఇప్పటికే గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లు త‌ప్పుబ‌ట్టారు. తాజాగా సురేష్‌ రైనా సైతం గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. ‘ఆఫ్రిది మా కశ్మీర్‌ గురించి పట్టించుకోవడం నువ్వు మానేస్తే మంచింది. మీ విఫల పాకిస్తాన్‌ దేశం కోసం ఏదైనా మంచి చేయొచ్చు కదా.?  కశ్మీర్ ఎప్పుడూ మా దేశంలో అంత‌ర్భాగ‌మే. క‌శ్మీర్ భార‌త్‌లో ఉన్నందుకు గర్వపడుతున్నా.’ అంటూ రైనా త‌న ట్విటర్ ద్వారా ఆఫ్రిదికి కౌంట‌ర్ ఇచ్చాడు. ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలా బాధించాయి. నువ్వు ఇచ్చిన పిలుపున‌కు  నేను మానవత్వంతో స్పందించాను. నువ్వు అడగ్గానే నా వంతు సాయం చేశా. మ‌రోసారి నీ పిలుపున‌కు నా నుంచి సాయం ఉండ‌దు అంటూ యూవీ ట్వీట్ చేశాడు. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: