ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా శర  వేగంగా వ్యాప్తి జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. అయితే భారత్లో కరోనా  వైరస్ కారణంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాస్త వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మొదట ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ వాయిదా వెయ్యగా  ఆ తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. విమాన సర్వీసులు మొదలు పెట్టకపోవడం కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోవడంతో... నిర్వహించలేక పోయారు. 

 


 అయితే ఈ ఏడాది జరగబోయే ఐ.పి.ఎల్ ను ఎప్పుడు నిర్వహించబోతున్నారు అనేది ప్రస్తుతం క్రికెట్ అభిమానులకు ఆటగాళ్ళకు  ఓ పెద్ద ప్రశ్నగా మారి పోయింది. ఎందుకంటే ప్రస్తుతం ఎంతోమంది ఆటగాళ్ళు ఐపీఎల్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ భవిష్యత్తు నిర్ణయించబోయే ఐపీఎల్ టోర్నీ కోసం ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్నారూ. అయితే త్వరలో ఐపీఎల్ ప్రారంభించబోతున్నారు అని గతకొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకవేళ త్వరలో పరిస్థితులు అనుకూలిస్తే ఐపీఎల్ అక్టోబర్లో లేదా నవంబర్లో నిర్వహించాలని బిసిసిఐ కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

 

 ఈ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై ఎన్నో వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఐపీఎల్ సంబంధించి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీ ఎప్పుడు జరపాలి అన్నది నిర్ణయించేది బిసిసిఐ కాదని... కేంద్ర ప్రభుత్వమే దీనిని నిర్ణయిస్తుంది అంటూ క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఐపీఎల్ నిర్వహణ దేశంలో కరోనా  ప్రభావం పై ఆధారపడి ఉంది అని తెలిపారు. ఒకవేళ ఐపీఎల్ టోర్నీ నిర్వహిస్తే భారత ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని భావించినప్పుడు... కేంద్ర ప్రభుత్వం ఐపీఎల్ నిర్వహించేందుకు ఆమోదం తెలుపుతుంది అంటూ ఆయన స్పష్టం చేశారు. కేవలం క్రీడా పోటీల కోసం భారత ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేము అంటూ తెలిపారు క్రీడల మంత్రి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ దృష్టంతా కరోనా  వైరస్ నియంత్రించడం లోనే ఉందని... ఐపీఎల్ నిర్వహించడంపై కాదు అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: