కొన్ని కొన్ని సార్లు కొంతమంది చేసే పనిలు  చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎంతో ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. చాలామంది అన్ని అవయవాలు సరిగా ఉన్నప్పటికీ ఏమి చేయలేకుండా నా వల్ల కావట్లేదు అంటూ ఇంట్లో కూర్చుండిపోతారు . లేదా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి ఏమీ చేయకుండానే ఉండిపోతారు. ఏదో సాధించాలని ముందుకు వెళ్లినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురుగానే మళ్లీ వెనుకడుగు వేసి తమ లక్ష్యం గురించి పూర్తిగా మర్చిపోతారు. ఇలా ఈ రోజుల్లో లక్ష్యం  పెట్టుకోకుండా దొరికిన దాంతో సర్దుకునే వారు చాలామంది. ఇంకొంతమంది లక్ష్యం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నాయని సమస్యలు ఉన్నాయని కష్టాల కడలిలో వెళుతున్నాము అంటూ కారణాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు

 

 

 కానీ లక్ష్యం సాదించాలి అంటే గొప్ప వ్యక్తులుగా ఎదగాలి అంటే సుఖంగానే ప్రయాణం ఉండదు కదా.. ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ముందుకు సాగాల్సిందే. ఎన్ని  ఇబ్బందులు ఎదురైనా  లక్ష్య సాధన కోసం పరితపించి ముందడుగు వేయాలసిందే . కానీ కొంతమంది మాత్రం శరీరంలోని అన్ని అవయవాలు పని చేస్తున్నప్పటికీ ఏదో ఒక కారణం చెప్పి అక్కడే ఆగిపోతారు . ఇలాంటి సమయంలో కొంతమంది అవయవాలు సరిగా లేకపోయినప్పటికీ.. శారీరకంగా  వికలాంగులు అయినప్పటికీ దృఢమైన లక్ష్యంతో ముందుకు సాగుతారు. వారిని చూస్తే ఒక్క క్షణం నిలబడి హ్యాట్సాఫ్ చేయక మానరు ఎవరైనా. తాజాగా క్రికెట్ దిగ్గజ ఆటగాడైన వివిఎస్ లక్ష్మణ్ ఇలాంటి ఒక వీడియో ని పోస్ట్ చేశాడు. 

 

 మీ హృదయంలో సాధించాలనే బలమైన సంకల్పం  ఉంటే.. మీ దారిలో వచ్చే ఏవైనా అడ్డంకులను అది తొలగిస్తుంది.. అమీర్ అనే కుర్రాడు ఇది నిరూపించారు. ఈ అద్భుతమైన వీడియో ద్వారా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఈ  చాలెంజింగ్  సమయంలో అమీర్  ఎంతో స్ఫూర్తినిచ్చాడు .... ఎక్కడ సాధించాలన్న దృఢ సంకల్పం ఉంటుందో అక్కడ తప్పక మార్గం ఉంటుంది అంటు  క్రికెట్ దిగ్గజం ఆటగాడైనా వీవీఎస్ లక్ష్మణ్ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: