ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... ఎన్నో కఠిన నిబంధనల మధ్య ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నాయి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. ఏ చిన్న పొరపాటు కూడా చేయకుండా కఠిన నిబంధనల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి. దీంతో గతంలో ఉన్న అన్ని రకాల సాంప్రదాయాలకు ఆటగాళ్లు స్వస్తి పలకాల్సి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ కూడా ఎన్నో కఠిన నిబంధనలను మధ్య  జరుగుతుంది. ఆటగాళ్లు అందరూ కూడా ఐసీసి  సూచించిన విధంగానే... క్వారంటైన్ లో  గడుపుతూనే మ్యాచ్లు ఆడుతున్నారు. ఆటగాళ్లు మాత్రమే కాదు సిబ్బంది సహాయక సిబ్బంది సైతం క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఐపీఎల్ లో సహాయకులుగా పని చేస్తున్నారు.



 ఇలాంటి నేపథ్యంలో ఆటగాళ్లు  బాల్ కి  లాలాజలం రుద్దడం లాంటివి చేయడం నిషేధం విధించింది ఐసీసీ . ఇటీవలే జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సారథి విరాట్ కోహ్లీ పొరపాటున నిబంధనలను ఉల్లంఘించాడు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న రాబిన్ ఊతప్ప ఉదంతం మరవకముందే... విరాట్ కోహ్లీ కూడా బంతికి లాలాజలం పూశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐసీసీ నిబంధనలు అతిక్రమించడం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తల పడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడో  ఓవర్ లో  పృథ్వీషా బ్యాటింగ్ చేస్తుండగా... ఒక మెరుపు షాట్ కొడితే అది  ఫీల్డింగ్  చేస్తున్న కోహ్లీ వద్దకు వెళ్లింది. బంతి పట్టుకున్న విరాట్ కోహ్లీ అనుకోకుండా పొరపాటున తన లాల జలాన్ని క్రికెట్ బంతి పూశాడు. ఇక ఆ తర్వాత నిబంధనలు గుర్తుకు వచ్చిన కోహ్లీ వెంటనే తన చేయిని వెనక్కి తీసుకొని... పొరపాటున జరిగింది అన్నట్లుగా నవ్వుతూ చేతిని పైకెత్తి సిగ్నల్ ఇచ్చాడు. కాగా ఇదే విషయంపై స్పందించిన సచిన్ టెండూల్కర్... గెలిచే కసిలో అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం మామూలే అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: