చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ ఫేవరెట్ జట్టుగా ఐపీఎల్ 2020 సీజన్లో రంగంలోకి దిగినప్పటికీ పేలవ ప్రదర్శనతో పూర్తిగా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నప్పటికీ అభిమానుల అంచనాలను తారుమారు చేస్తూ ధోని సేన ఓటమి చవి చూస్తూనే ఉంది. ప్రతి ఐపీఎల్ సీజన్ లో అద్భుత ప్రతిభ కనపరిచి  ఎప్పుడూ టాప్ ప్లేస్ లో కొనసాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి మాత్రం వరుస ఓటములతో రోజురోజుకూ పాయింట్ల పట్టికలో దిగజారిపోతోంది. దీంతో ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలవడం పక్కన పెడితే కనీసం చెన్నై జట్టు ప్లే ఆప్ కి అర్హత సాధిస్తుందా అన్నది కూడా క్రికెట్ ప్రేక్షకులందరికీ ప్రస్తుతం అనుమానం గా మారిపోయింది.



 అయితే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బాల్ వరకు ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ఎంతో ఉత్కంఠగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై టాప్ ఆర్డర్ మొత్తం రెచ్చిపోయి ఆడటంతో జట్టు భారీ స్కోరు లభించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్లను చెన్నై బౌలర్లు కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ చెలరేగి ఆడి ఏకంగా  సెంచరీ చేశాడు. ఈ క్రమంలోనే చెన్నై జట్టు లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.




 చెన్నై జట్టులో కీలక బౌలర్ గా ఉన్న బ్రావో గాయం కారణంగా బౌలింగ్ చేయలేకపోవడంతో చివరి ఓవర్ చివరి ఒక స్పిన్నర్ తో వేయించాల్సిన పరిస్థితి వచ్చింది. సాధారణంగా చివరి ఓవర్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు ఎంత దిగ్గజ బౌలర్ వేసినప్పటికీ భారీగా సిక్సర్లు కొట్టేందుకు బ్యాట్ మెన్  ప్రయత్నిస్తూ ఉంటాడు.  ఈ క్రమంలోనే ఇక స్పిన్ బౌలింగ్ లో అయితే ఒక ఆట ఆడుకుంటాడు బ్యాట్మెన్. ఒకవేళ స్పిన్ బౌలింగ్ చేస్తే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిసినప్పటికీ బ్రావో గాయం బారిన పడడంతో ఇక చేసేదేమీ లేక మిగిలిన ఒక్క ఓవర్ ని రవీంద్ర జడేజా అప్పగించాడు మహేంద్రసింగ్ ధోని. అనుకున్నట్లుగానే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా బౌలింగ్ లో సిక్సర్ల వర్షం కురిపించి ఢిల్లీ జట్టును గెలిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: