రసవత్తరంగా సాగిపోతున్న ఐపీఎల్ పోరులో భాగంగా నిన్న కోల్కతా నైట్ రైడర్స్... రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లు అద్భుతంగా కట్టడి చేయడంతో కేవలం అత్యల్పంగా 85 పరుగులకీ  మాత్రమే పరిమితం అయింది కోల్కత నైట్ రైడర్స్ జట్టు. 8 వికెట్ల నష్టానికి 20 ఓవర్లు ముగిసేసరికి 85 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టార్గెట్ ఎంతో సులువు గా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ఎంతో సునాయాసంగా రెండు వికెట్ల నష్టానికి 39 బంతులు మిగిలి ఉండగానే విజయ ఢంకా మోగించింది  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఈ మ్యాచ్లో బౌలింగ్ విభాగంలో మహమ్మద్ సిరాజ్ హీరో గా నిలిచిన విషయం తెలిసిందే. కేవలం ఒక్క మ్యాచ్ తో  హీరోగా మారిపోయాడు పేసర్ మహమ్మద్ సిరాజ్. నాలుగు ఓవర్లలో  కేవలం ఎనిమిది పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే యువ బౌలర్ సిరాజ్ కి ఇవి మరిచిపోలేని గణాంకాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే మొదటి నుంచి సిరాజ్ తో కాకుండా వాషింగ్టన్ సుందర్ తో బౌలింగ్ చేయిస్తున్నాడు విరాట్ కోహ్లీ కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం  పేసర్ మహమ్మద్ సిరాజ్ కి అవకాశం ఇచ్చాడు. ఇక బౌలింగ్ కు దిగిన తొలి ఓవర్లోనే వరుసగా రాహుల్  త్రిపాఠి, నితీష్ రాణా లను  పెవిలియన్ చేర్చాడు సిరాజ్. అయితే నితిన్  రాణా  క్రీజు  లోకి రాగానే వికెట్లకు దూరంగా బౌన్సర్ వేయమని సిరాజ్ కు విరాట్ కోహ్లీ సూచించాడట. కానీ బౌలింగ్ చేయడానికి రన్నప్  తీసుకుంటున్న సమయంలో సిరాజ్ మనసు మార్చుకుని సరిగ్గా వికెట్ల పైకి బంతి విసిరాడు  చివరికి ఫలితం రాబట్టాడు. ఇలా కెప్టెన్ చెప్పిన మాట వినకుండా సిరాజ్ మంచి ఫలితం రాబట్టాడు అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: