ఐపీఎల్ సీజన్ లో మొదటి నుంచి పేలవ  ప్రదర్శన కనబరుస్తూ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. పంజాబ్ టీం కెప్టెన్  కె.ఎల్.రాహుల్ అద్భుతంగా రాణించి ఎన్నో పరుగులు చేసినప్పటికీ జట్టు ఆటగాళ్లు నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో పంజాబ్ జట్టు వరుసగా ఓటమి చవి చూస్తూ పాయింట్ల పట్టికలో చివరిలో  కొనసాగిన విషయం తెలిసిందే. కానీ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడం కోసం  ప్రస్తుతం వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.


 పంజాబ్ జట్టు ఉన్న జోరుగా చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ప్లే ఆప్ కి అర్హత సాధించడం పక్క అని అర్థమవుతుంది. కాస్త ఆలస్యంగా జోరందుకున్నప్పటికీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మాత్రం ఏకంగా  వరుస విజయాలను అందుకుంటుంది. నిన్న  సన్రైజర్స్ హైదరాబాద్ తో  జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన పోరు ఎంతో హోరాహోరీగా జరిగింది. ఇక చివరి వరకు ఏ జట్టు గెలుస్తుంది అని అటు టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక చివరికి 12 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది పంజాబ్.


 అయితే 24 బంతులు 27 పరుగులు సమీకరణ ఉన్న సమయంలో సన్రైజర్స్ ఎంతో సునాయాసంగా గెలుస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ ఒక్క క్యాచ్  మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఇన్నింగ్స్ 17 ఓవర్ లో  క్రిస్ జోర్డాన్ వేసిన బౌలింగులో లాంగ్ ఆన్ దిశగా మనిషి పాండే భారీ షాట్ ఆడాడు. అప్పటివరకు ఎలాంటి బౌండరీలు కొట్టకుండా కేవలం సింగిల్స్ డబుల్స్ తో మాత్రమే సరిపెట్టిన మనీష్ పాండే తొలిసారి భారీ షాట్ ఆడాడు. గాల్లోకి ఎత్తుగా వెళ్లిన బంతి బౌండరీ ఆవల సిక్స్ గా పడుతుంది అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా వచ్చిన సుచిత్ బౌండరీ లైన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి గాల్లోకి ఎగిరి బంతిని ఎంతో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అక్కడి నుంచి సన్రైజర్స్ పతనం మొదలైంది. వరుసగా  వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ 112 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: