ఐపీఎల్ పోరు  ఎంతో రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మొన్నటివరకు ఐపీఎల్ లో మంచి ఫామ్లో ఉన్న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాయి. ఆడిన ప్రతి మ్యాచ్లో దాదాపుగా విజయాలు సాధిస్తూ దూసుకుపోయాయి. కానీ ఇటీవలి కాలంలో మాత్రం పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న మూడు జట్లకు  కూడా భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. మొదటి నుంచి వరుస  ఓటమి చవి చూస్తూ వచ్చిన జట్లు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి పట్టిన పట్టు విడువలేదు. నిన్నటి వరకు వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న జట్లు ప్రస్తుతం విజయ పరంపర కొనసాగిస్తూ టాప్ ప్లేస్ లో ఉన్న జట్లకు సైతం షాక్ ఇస్తున్నాయి.



 ముఖ్యంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుసగా విజయకేతనం ఎగురవేసుకుంటూ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటు  దూసుకుపోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా వరుసగా ఐదు విజయాలను నమోదు చేసింది కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు. అంతకుముందు వరకు వరుస ఓటములు చవిచూసి పాయింట్ల పట్టికలో చివరణ ఉన్న పంజాబ్ జట్టు.. ప్రస్తుతం వరుస విజయాలను నమోదు చేసుకుంటూ పైపైకి ఎగబాకుతోంది వచ్చింది. ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆటతీరును చూసి  క్రికెట్ అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.



 ఎందుకంటే ప్రస్తుతం వరుసగా ఐదు విజయాలు నమోదు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. ఇక నిన్న కోల్కతా నైట్రైడర్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఎంతో సునాయాసంగా విజయం సాధించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. మొదట బ్యాటింగ్కు దిగిన జట్టు కెప్టెన్ ఓపెనర్ కె.ఎల్.రాహుల్ 47 పరుగులతో మంచి ఆరంభం అందించాడు. ఇక ఆ తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మన్దీప్ సింగ్ మంచి ఇన్నింగ్స్ ఆడారు . దీంతో కేవలం రెండు వికెట్ల నష్టానికి 19 ఓవర్లు కూడా పూర్తికాకముందే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విజయం సాధించేందుకు.



 దీంతో  ఐదో విజయాన్ని నమోదు చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుంచి వరుస విజయాలతో ఇక ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్ ఆశలు మరింత సుగమం చేసుకుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. నాలుగవ స్థానంలో ఉన్న కోల్కత నైట్ రైడర్స్ జట్టును చిత్తు చేసి  మంచి విజయాన్ని అందుకుంది. ప్రతి మ్యాచ్లో కూడా పట్టువిడవకుండా.. మంచి విజయాన్ని అందుకుంటున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. ఏకంగా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకీ  ఏకంగా  నాలుగవ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు అందరూ మురిసిపోతున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: