అయితే ముంబై ఇండియన్స్ జట్టులో ప్రతి ఆటగాడు కూడా ఎంతో బాధ్యత గల ఇన్నింగ్స్ ఆడుతుంటాడు అన్న విషయం తెలిసిందే. బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఫీల్డింగ్ విభాగంలో కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఎంతో పటిష్టంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు రోహిత్ శర్మ ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రత్యర్థిని బోల్తా కొట్టిస్తు ఉంటాడు. ఇక అంతే కాకుండా ఆటగాళ్లందరూ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు రోహిత్ శర్మ.
ముంబై ఇండియన్స్ జట్టు వరుస విజయాలు సొంతం చేసుకోవడంపై ఇటీవలే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు ఎప్పుడూ కూడా ఒకరిద్దరు ప్లేయర్ల పైన ఆధారపడి ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. జట్టులోని ప్రతి ఆటగాడు కూడా ఎంతో బాధ్యత తీసుకొని ఆడతారని తమ విజయ రహస్యం ఇదే అంటూ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్ అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ముంబై ఇండియన్స్ జట్టులో నిలకడను తీసుకొచ్చిందని అతని బ్యాటింగ్ వేరే లెవెల్ ఉంటుంది అంటూ ప్రశంసలు కురిపించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి