కొన్నిసార్లు బిసిసిఐ సెలెక్టర్లు  వ్యవహరించే తీరు చర్చనీయాంశంగా మారి పోవడం తోపాటు విమర్శలకు దారి తీస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గతంలో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్ కోసం  భారత జట్టులో అంబటి రాయుడి ఎంపిక చేయకపోవడంపై కూడా బీసీసీఐ  విమర్శలు ఎదుర్కొంది. ఇటీవల ఇదే విషయంపై భారత మాజీ సెలెక్టర్ దేవాంగ్  గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం భారత జట్టులో అంబటి రాయుడికి చోటు కల్పించకపోవడం.. సెలక్టర్ల తప్పిదమే  అంటూ ఆయన అంగీకరించారు. కాగా  అప్పుడు వరకు అంబటి రాయుడుకు భారత జట్టులో నాలుగవ స్థానంలో వరుసగా అవకాశాలు వచ్చిన భారత సెలెక్టర్లు వరల్డ్ కప్ కి మాత్రం ఎంపిక చేయకుండా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.



 దీంతో తీవ్ర నిరాశ చెందిన అంబటి రాయుడు ఏకంగా బిసిసిఐ సెలక్టర్ల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ తర్వాత సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ విభాగంలో తేలిపోయే ఓటమి చవిచూసి ఇంటిదారి పట్టింది.  దీంతో ఒకవేళ అంబటి రాయుడు  ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అనే వాదనలు కూడా గతంలో వినిపించాయి. అయితే అంబటిరాయుడు స్థానంలో ఆడిన విజయ శంకర్ కేవలం ఒక్క మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్ లలో కూడా తేలిపోయాడు. దీంతో బిసిసిఐ సెలక్టర్ల పై విమర్శలు వచ్చాయి.


 ఇదే విషయంపై భారత మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ మాట్లాడుతూ.. 2019 వరల్డ్ కప్ కి రాయుడి ఎంపిక చేయకపోవడం తప్పిదమే  కానీ మేము మనుషులమే కదా.. మేం ఎంపిక చేసిన జట్టు కాంబినేషన్ అద్భుతంగా రాణిస్తుందని అనుకున్నాం.. ఆ తర్వాతే అసలు నిజం మాకు తెలిసింది.. వరల్డ్ కప్ జట్టు లో రాయుడు ఉంటే ఎంతో ఉపయోగపడే వాడు అన్న విషయం బోధపడింది అంటూ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ లో  చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు బాధ నేను అర్థం చేసుకోగలను... అసహనం వ్యక్తం చేయడంలో కూడా న్యాయం ఉంది అంటూ  ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు బీసీసీఐ మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి: