ఇటీవలే ఐపీఎల్ టోర్నీలో ఎంతో అద్భుతంగా రాణించిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థులుగా మారి  హోరాహోరీగా తలపడ్డారు అన్న  విషయం తెలిసిందే. ఐపీఎల్ లో వివిధ జట్లుగా విడిపోయి భారత జట్టులో ఒకటి గా ఉండే ఆటగాళ్లందరూ ప్రత్యర్థులుగా మారిపోయి... హోరాహోరీగా తలపడి  ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందించారు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ ముగియగానే అందరూ భారత ఆటగాళ్లు ఒక జట్టుగా ఏర్పడి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. కాగా  కరోనా నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తిచేసుకున్న భారత ఆటగాళ్లు ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు అనే విషయం తెలిసిందే.



 దాదాపు 9 నెలల తర్వాత భారత జట్టు విదేశీ పర్యటనకు వెళ్లి... వన్డే టి20 టెస్ట్ సిరీస్లో ఆడబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ప్రస్తుతం భారత జట్టు తీవ్రస్థాయిలో ప్రాక్టీస్ చేస్తోంది. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా రెండు టీములుగా విడిపోయి మ్యాచ్ ఆడారు. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ టీం విజయం సాధించింది. ఒక టీంకు కె.ఎల్.రాహుల్ మరో టీంకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించి రెండు టీములుగా ఏర్పడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన రాహుల్ టీం 40 ఓవర్లలో 236 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే రాహుల్ 83 పరుగులు చేశాడు.



ఆ తరువాత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్ వచ్చింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 91 పరుగులు చేశాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో తమదే విజయం అంటూ అటు కోహ్లీసేన భీమ వ్యక్తంచేస్తోంది. అటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా తీవ్ర స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు మూడు టి20 నాలుగు టెస్ట్ సిరీస్ లను  ఆడనుంది. టెస్ట్ సిరీస్ లలో  భాగంగా మొదటి మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడు. విరాట్ కోహ్లీ భార్య  అనుష్క శర్మ ప్రసవం కారణంగా భారత్ తిరిగి వస్తాడు విరాట్ కోహ్లీ. ఆ సమయంలో టెస్టు జట్టుకు రహానే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: