ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో  ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో వన్డే టి20 టెస్ట్ సిరీస్ లు  ఆడేందుకు సిద్ధమవుతున్నది భారత జట్టు.  డిసెంబర్ 17న భారత్-ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ టీమిండియా జట్టు దూరం అవుతుండడం టీమిండియాకు ఎంతగానో మైనస్ గా మారింది.  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి జనవరి నెలలో ప్రసవం  ఉన్న కారణంగా... ఆ సమయంలో భార్య కు తోడుగా ఉండాలని భావించిన విరాట్ కోహ్లీ బీసీసీఐ  దగ్గర పితృత్వ సెలవులకు దరఖాస్తు చేసుకున్నాడు ఈ క్రమంలోనే బిసిసిఐ సానుకూలంగా స్పందించింది



 ఈ క్రమంలోనే టీమిండియా లో కీలక ఆటగాడు డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండానే టీమిండియా జట్టు మూడు టెస్టు మ్యాచ్ లు  ఆడేందుకు సిద్ధమైంది.  ఈ క్రమంలోనే జట్టులో విరాట్ కోహ్లీ లేని లోటుపూడ్చడం ఎంతో కష్టతరమైన పని అని ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జట్టులో విరాట్ కోహ్లీ కి ప్రత్యామ్నాయం ఎవరు అనే దానిపై కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. తాజాగా దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో విరాట్ కోహ్లీకి ఏకైక ప్రత్యామ్నాయం శుభ్ మన్ గిల్  అంటూ చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా.



 విరాట్ కోహ్లీ ఇండియాకు బయలుదేరిన తర్వాత మిడిలార్డర్లో శుభ్ మన్ గిల్ రాణించగలరు అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.  ఒకవేళ ఓపెనర్ స్థానంలో పృథ్వీ షా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే  కె.ఎల్.రాహుల్ ను ఆడించేందుకు కూడా అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు.  కాగా భారత జట్టు నుంచి తప్పుకుని విరాట్ కోహ్లీ ఇండియా రానున్న నేపథ్యంలో డిసెంబర్ 17 తర్వాత జరిగే మ్యాచ్లో అజింక్య రహానే నాయకత్వంలో భారత టెస్టు జట్టు రంగంలోకి దిగనుంది.  ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ లేకుండాటీమిండియా ఎలా రాణించ పోతుంది అనే దానిపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: