కానీ మొదట రెండు మూడు మ్యాచ్లలో రిషబ్ పంత్ బాగా రాణించినప్పటికీ ఆ తర్వాత మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటూ అందరిని నిరాశ పరుస్తూనే ఉన్నాడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు అనుకున్న రిషబ్ పంత్ పరిస్థితి.. అసలు జట్టులో స్థానం దక్కుతుందో లేదో అనే విధంగా మారిపోయింది. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ కీపింగ్ లో చేసిన వైఫల్యాలు టీమిండియా జట్టును ప్రేక్షకులను కూడా ఎంతగానో నిరాశ పరిచాయి.
ఎంతో సింపుల్గా అందుకోవాల్సిన క్యాచ్ లను సైతం రిషబ్ పంత్ వదిలేయడంతో ప్రస్తుతం రిషబ్ పంత్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. రిషబ్ పంత్ క్యాచ్లు వదిలేయడం పై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ సెటైర్లు వేశాడు. టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన తర్వాత రిషబ్ పంత్ వదిలేసినన్ని క్యాచ్ లు మరే క్రికెటర్ కూడా వదిలేసి ఉండడు. వికెట్ కీపింగ్ లో పంత్ ఎంతో మెరుగు అవ్వాల్సి ఉంది. సిడ్నీ టెస్ట్ తొలి రోజు ఎంతో కీలకమైన రెండు క్యాచ్ లను రిషబ్ పంత్ వదిలేశాడు అంటూ రికీపాంటింగ్ కామెంట్ చేశాడు. రిషబ్ పంత్ చెత్త కీపింగ్ పై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి