మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సంచలన కామెంట్స్ చేశాడు. జట్టులో ప్రదర్శన సరిగా లేని ఆటగాడిపై వేటు వేయడంలో సి‌ఎస్‌కే ఏమాత్రం వెనకడుగు వెయ్యదంటూ చెప్పుకొచ్చాడు. వచ్చే నెలలో ఐ‌పి‌ఎల్ సీజన్ 2021 కి  సంభందించి మినీ వేలం నిర్వహిస్తుండగా తమతో ఉండే ఆటగాళ్లను, తాము వదిలేసే ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి అన్నీ జట్లు. సి‌ఎస్‌కే కూడా ఆ జట్టులో ఆరుగురి ఆటగాళ్లను విడిచిపెట్టింది. ముఖ్యంగా కేధార్ జాదవ్ ను విడిచి పెట్టడం పై పలువురు తమ అభిప్రాయాన్ని వెల్ల బుచ్చుతున్నారు. ఇదే విషయం తో గౌతమ్ గంభీర్ స్పందించాడు.

కేదార్‌ జాదవ్‌‌ను పక్కనపెట్టడానికి అతడి ఫామ్‌ మాత్రమే కారణం కాదని అన్నాడు. ముఖ్యంగా అతడికి రూ.7.8 కోట్లు చెల్లించలేకే వదిలేసిందని ఆరోపించాడు. అదే రూ.3 లేదా 4 కోట్లు అయితే రిటైన్డ్‌ చేసుకునేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జట్టు కూర్పు లో ఎం‌ఎస్ ధోని కీలక పాత్ర వహిస్తాడని చెప్పుకొచ్చాడు. ఒకవేళ కేదార్‌ ధర రూ.3-4 కోట్లు అయితే అతడిని ధోనీ మరో సీజన్‌ వరకు కొనసాగించేవాడని అన్నాడు. ముఖ్యంగా ధోనీ జట్టు కూర్పులో మరీ లోతుగా ఆలోచించడని, నిర్దిష్ట సీజన్‌ వరకు మాత్రమే ఆలోచిస్తాడని పేర్కొన్నాడు.

ఒక్క కేదార్ జాదవ్ విషయంలో మాత్రమే కాక, పియూష్ చావ్లా విషయంలో కూడా సి‌ఎస్‌కే ఇదే విధంగా ఆలోచించిందని, అతడినికి కూడా అధిక ధర వెచ్చించాల్సి వస్తుందన్న కారణంతోనే విడిచిపెట్టిందని చెప్పుకొచ్చాడు.,. తక్కువ దర కు ఉన్న కర్ణ్‌ శర్మ, ఇమ్రాన్ తాహిర్‌ను అంటిపెట్టుకుందని వ్యాఖ్యానించాడు. మరోవైపు బెంగుళూరు కూడా పది మంది ఆటగాళ్లను వదులుకుందని అన్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే విజయంతమవుతుండటానికి కారణం వాళ్ల ఆలోచనలేనని కొనియాడాడు. జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్లతో పాటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండే అందరి ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తారని, సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్టుకు ఇదే తేడా అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: