పంత్ దూకుడుగా ఆడుతూ చెలరేగుతుంటే పూజారా అతనికి సహయంగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతు ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సెంచరీ వైపు వెళుతూ ఉండగా పంత్ 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడు. మరి అదేవిధంగా టీమిండియా కోలుకుంటున్న దశలో పుజారా అవుట్ కూడా ఔట్ అవడంతో పెద్ద దెబ్బ పడింది. అయితే పూజారా ఔట్ అయిన తీరు చూస్తే అయ్యో పాపం ఆనక మానరు. ఇన్నింగ్స్ 51వ ఓవర్ వేసిన స్పిన్నర్ డొమినిక్ బెస్ బౌలింగ్‌లో చతేశ్వర్ పుజారా (73 పరుగులు) స్వ్కేర్ లెగ్ దిశగా బంతిని ఫుల్ చేశాడు.
అతను అనుకున్న రీతిలోనే షాట్ కనెక్ట్ అయినప్పటికి.. బంతి నేరుగా వెళ్లి షార్ట్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్ భుజానికి తాకి మిడాన్‌లో గాల్లోకి లేచింది. దాంతో అక్కడే ఉన్న రోరీ బర్న్స్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పుజారాకు ఏం చేయాలో అర్థం కాక కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో ఓ అభిమాని ట్విటర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు "అయ్యో పాపం పూజారా దురదృష్టవంతుడు" అని కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి