యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అన్న విషయం తెలిసిందే. ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు ఇక పరుగుల వరద పారుస్తూ  ఉంటాడు. నిలబడిన చోటు నుంచి ఎలాంటి ఫుట్వర్క్ లేకుండా ఏకంగా మైదానం అవతలకి సిక్స్ కొట్టడం లో క్రిస్ గేల్ కి ఎవరు సాటి లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా క్రిస్ గేల్ తన కెరీర్లో కేవలం సిక్సర్లతో నే ఆరు వేల పరుగులు పూర్తి చేశాడు అంటే క్రిస్ గేల్ విధ్వంసం ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.



 ప్రస్తుతం 40 ఏళ్లు దాటిన పోతున్న కూడా రిటైర్మెంట్ అనే ఆలోచన లేకుండా ప్రస్తుతం అదిరిపోయే ఫామ్ లో  కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు క్రిస్ గేల్... ఇకపోతే అటు  టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో  కొనసాగుతున్నాడు  అనే విషయం తెలిసిందే. టీమిండియా విజయంలో ఎప్పుడూ కీలకపాత్ర వహిస్తూ అటు మైదానంలో పరుగుల వరద పారిస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఇంతకీ ఈ ఇద్దరి గురించి ప్రస్తుతం ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అని అంటారా.. ఇద్దరు హార్డ్  హీటర్ ల గురించి.. వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.



 టీ20ల్లో డబుల్ సెంచరీ చేయగల సత్తా కేవలం క్రిస్ గేల్  రోహిత్ శర్మ లకు మాత్రమే ఉంది అంటూ వ్యాఖ్యానించాడు నికోలస్ పూరన్. క్రిస్ గేల్ ఇప్పటికే టీ20లో 175 పరుగులు చేశాడని రోహిత్ శర్మ కూడా నాలుగు సెంచరీలు సాధించాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఒక క్రికెట్ సంబంధిత మీడియా లో ఇంటర్వ్యూ కు హాజరైన నికోలస్ పురన్  ఈ ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పలువురు ఆటగాళ్లు గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు తీసుకొచ్చాడు నికోలస్ పూరన్. ఇకపోతే వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఎన్నో రోజుల తర్వాత మళ్లీ అంతర్జాతీయ టీ20 లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: