ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్ వెల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ  స్టార్ ఆటగాడు ఒక్కసారి మైదానంలో కుదురుకున్నాడు అంటే పరుగుల వరద పారిస్తాడు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టు విజయంలో ఎప్పుడు గ్లెన్ మాక్స్వెల్ కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి ఇక అతి తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసి స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ  ఉంటాడు మాక్స్ వెల్. గత ఏడాది జరిగిన ఐపీఎల్లో పేలవ ప్రదర్శన తో  తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ఈ స్టార్ ఆటగాడు ఆ తర్వాత భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరుస సిరీస్లలో మాత్రం మెరుపు ఇన్నింగ్స్ తో ఆశ్చర్యపరిచాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక అదే ఫామ్ కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తూ  స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూనే ఉన్నాడు ఈ స్టార్ క్రికెటర్.  అయితే మాక్స్వెల్ భారీ సిక్సర్లు కొట్టడం లో దిట్ట అన్న  విషయం తెలిసిందే. గత  ఏడాది భారత్ తో వరుసగా సిరీస్ లు  ఆడిన ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ లు  ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్ తో  జరుగుతున్న సిరీస్లో భాగంగా..  మాక్స్వెల్ ఒక భారీ సిక్సర్ కొట్టాడు. ఈ భారీ సిక్సర్ స్టేడియం లోకి దూసుకెళ్లడమే కాదు ఏకంగా ఒక కుర్చీని బద్దలు కొట్టింది.



 ఇటీవలే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య జరిగిన టి20 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ మాక్స్వెల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.  అతి తక్కువ బంతుల్లోనే భారీగా పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే మాక్స్వెల్ కొట్టిన ఒక భారీ సిక్స్ కాస్త స్టేడియం లోకి దూసుకెళ్లి ఇక అక్కడ కూర్చుని బద్దలు కొట్టింది.  అదృష్టవశాత్తూ స్టేడియంలో ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా  మాక్స్వెల్ సిక్స్ కొట్టిన సమయంలో పగిలిపోయిన కుర్చీని వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ కుర్చీపై మాక్స్వెల్ తన సంతకం కూడా పెట్టడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: