ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది  మొన్నటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడంలో విజయం సాధించాయి. కానీ ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య మరోసారి  పెరిగిపోతుంది.  అయితే మునుపటి కంటే వేగంగా ప్రస్తుతం కరోనా వైరస్  వ్యాపిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అయోమయం లో పడిపోయే  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుతం అందరికీ కరోనా వైరస్ పై పూర్తి స్థాయి అవగాహన ఉండడం తో ఇక తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటున్నారు. మరి కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కరోనా వైరస్ కార్మికులుగా మారిపోతున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది.


 అయితే కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడమే కాదు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా ఏర్పడింది. కనీస ఉపాధి కరువవ్వడంతో చివరికి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయారు సామాన్య ప్రజలు. మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో  ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయారు. కరోనా వైరస్ కారణంగా అటు సినీ పరిశ్రమ క్రీడా పరిశ్రమ అన్ని కూడా సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇక ప్రస్తుతం క్రీడాకారులు అయితే బయో బబుల్ పద్ధతిలో క్వారంటైన్ లో ఉంటూ క్రికెట్ మ్యాచ్లు ఆడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.


 కరోనా ఓ వరం అంటూ బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించారు. ముంబై లో రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించడం స్టేడియం దగ్గర ప్రేక్షకుల కోలాహలం లేకపోవడంతో క్రికెటర్ల రవాణా ఎంతో సులభం గా మారిపోయింది అంటూ చెప్పుకొచ్చారు సౌరబ్ గంగూలీ. ఆటగాళ్లు అందరూ స్టేడియం నుంచి హోటల్ కి వెళ్లడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు అంటూ తెలిపారు. ప్రస్తుత సమయంలో కరోనా ఒక వరం గా మారిపోయింది అంటూ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం స్టేడియంకు వెళ్లేందుకు అనుమతి లేని నేపథ్యంలో టీవీ ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఒక్కొక్క మ్యాచ్ వీక్షిస్తున్న ప్రేక్షకుల సంఖ్య 50 లక్షల వరకు పెరిగిందని ప్రస్తుతం బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: