.jpg)
అంతే కాకుండా లిన్ మాట్లాడుతూ ఐపీఎల్ ద్వారా ఆస్ట్రేలియా ఆటగాడు సంపాదించే ప్రతి రూపాయిలో 10 % ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కు వస్తుంది. కాబట్టి ఆ డబ్బును ఛార్టర్డ్ ఫ్లైట్ కోసం ఉపయోగించే అవకాశం ఉంటే చేయగలరు అని విన్నవించుకున్నారు. దీనికి మోరీసన్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. మీరు వెళ్ళింది ఇండియాలో ఒక స్థానిక లీగ్ ఆడడానికి మాత్రమే. ఇది పూర్తిగా మీ వ్యక్తిగత సదుపాయాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి వసతులను ఏర్పాటు చేయదు. ఒకవేళ మీరు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తరపున ఆడడానికి వెళ్లి ఉంటే మేము మీకు అన్ని రకాల వసతులను కల్పించేవాళ్ళము అని సమాధానమిచ్చారు. కాబట్టి ఆటగాళ్లు వారి వారి స్వంత ఖర్చులతో స్వదేశానికి రావడానికి సిద్ధం కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్న వారికి నెక్స్ట్ వీక్ లో వ్యాక్సిన్ వేయనున్నారు. ఇప్పటికే కరోనా భయంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లయిన ఆడమ్ జంపా మరియు కేన్ రిచర్డ్ సన్ ఐపీఎల్ ని వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. మరియు ఇంగ్లాండ్ ఆటగాడయిన లియాన్ లివింగ్ స్టన్ కూడా బయో బబుల్ లో ఉండలేక అర్ధాంతరంగా వెళ్ళిపోయాడు. దీనితో ఆటగాళ్లలో ఆందోళన ఎక్కువవుతోంది. మరి కొంతమంది ఆటగాళ్లు చెబుతున్న ప్రకారం దేశం మొత్తం కరోనా ప్రమాదంలో ఉన్నప్పటికీ మనము బయో బబుల్ సంరక్షణలో ఉన్నామని ధైర్యం చెబుతున్నారు. మరి ఇలాంటి ఇతర దేశీయ ఆటగాళ్లను ఐపీఎల్ తర్వాత వారి దేశాలు సదుపాయాలు కల్పించకపోతే బీసీసీఐ చొరవ తీసుకుంటుందా అనే కోణంలోనూ ఆటగాళ్లు ఆలోచిస్తున్నారు. మరి ఏమి జరగనుందో ఐపీఎల్ పూర్తయ్యాక గానీ తెలిసే అవకాశం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి