ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది.  దీంతో ఇక ఎన్నో విపత్కర పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అయితే కరోనా నుంచి బయటపడేందుకు ప్రపంచం ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అంతకంటే ఎక్కువగానే ప్రపంచాన్ని మొత్తం వైరస్ చుట్టేస్తోంది ఈ క్రమంలో ప్రపంచం మొత్తం అడుగడుగునా భయపడుతూనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాల్లో సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే క్రీడా రంగం కూడా కోలుకోలేని విధంగా దెబ్బ పడింది ఎప్పుడు వివిధ రకాల క్రీడలు.. స్టేడియం నిండా ప్రేక్షకులు ఈలలు గోలలు ఇలా క్రీడారంగం మొత్తం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది.



 కానీ కరోనా వైరస్ కారణంగా ఈ అనుభూతి ఎక్కడ లేకుండా పోయింది అనే చెప్పాలి.  బయో బబుల్ పద్ధతిలో వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నప్పటికీ అటు ప్రేక్షకులు మాత్రం స్టేడియంలో ఉండడం లేదు. అయితే ఇప్పటికే వివిధ రకాల క్రీడలను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తుండగా ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టోక్యో ఒలంపిక్స్ కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా  ఏడాది పాటు వాయిదా పడుతూ వస్తోంది టోక్యో ఒలంపిక్స్. ఇక జపాన్లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల తరలివస్తుంటారు.



 తమ దేశ క్రీడాకారులను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశం లేకుండా పోయింది. కరోనా వైరస్ కారణంగా విదేశీ ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలంపిక్స్ నిర్వహించాలి అని అటు నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అటు జపనీయులకు అనుమతి ఇవ్వడంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నాము అంటూ చెబుతున్నారు నిర్వాహకులు. ఈ విషయంపై జూన్ లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. అయితే జూలై 23వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు టోక్యో ఒలింపిక్స్ జరుగనున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: