ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు 20 రోజుల సెలవులను ఎంజాయ్ చేసిన టీమ్ ఇండియా జట్టు ఆగస్టు 4వ తేదీ నుంచి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. అయితే ఇప్పటికే ఇక ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన టెస్ట్ జట్టులో పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డాడు. ఓపెనర్  శుభ మన్ గిల్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఇప్పటికీ గాయం బారినపడి జట్టుకు దూరమయ్యాడు  అంతేకాకుండా స్టాండ్బై గా ఉన్న  ఆవేశ్ ఖాన్ కి సైతం ఎడమ చేతి బొటనవేలు విరగడంతో ఇక చివరికి భారత్ బయలుదేరుతున్నాడు.



 ఇలాంటి సమయంలో ఇక టీమిండియా మరింత పటిష్టంగా మారేందుకు శ్రీలంక పర్యటనలో ఉన్న ఇద్దరు యువ ఆటగాళ్లను బీసీసీఐ ఇక ఇంగ్లండ్ పర్యటనకు అటు నుంచి అటే పంపించ పోతుంది అని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో భాగంగా అద్భుతం గా రాణిస్తున్న యువ ఓపెనర్ పృద్విషా, సూర్య కుమార్ యాదవ్ లను బీసీసీఐ ఇక ఇంగ్లాండ్ టూర్ కు పంపిస్తుంది అన్న టాక్ వినిపించింది. ఇక ఇప్పుడూ ఇద్దరు ఆటగాళ్ళ విషయంలో అనుకున్నదే జరిగింది. ఆ ఇద్దరిని ఇంగ్లండ్ పర్యటన కోసం పంపించేందుకు బీసీసీఐ రెడీ అయింది. ఇక ఇటీవలే ఇంగ్లాండ్ జట్టుతో ఆగస్టు 4వ తేదీ నుంచి తల పడబోయే భారత జట్టు యొక్క వివరాలను బీసీసీఐ ప్రకటించింది.



 ఈ క్రమంలోనే ఇక శ్రీలంక పర్యటనలో భాగంగా టి20  సిరీస్ ముగియగానే సూర్యకుమార్ యాదవ్  పృద్వి షా  కూడా అటు నుంచి అటే ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో బయో బబుల్ ఉన్నారు ఇద్దరు ఆటగాళ్ళు. అటు నుంచి నేరుగా ఇంగ్లాండుల లో బయో బబుల్ లోకి చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆటగాళ్లకు ఇక క్వారంటైన్ నిబంధనలు ఉండే అవకాశం లేదు అనే టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం పొట్టి క్రికెట్ లో అద్భుతం గా రాణిస్తున్న ఇద్దరు ఆటగాళ్ళు టెస్ట్ క్రికెట్లో ఎలా రాణించగలుగుతారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: