ఇలా ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తంలో నజరానా ఇస్తూ ఉండగా ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ మొత్తంలో ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు నజరానా ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా ఇక అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు కూడా క్రీడాకారులకు అందిస్తున్నాయి. ఇలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఒలంపిక్స్ లో క్రీడాకారులకు ఎన్నో నజరానాలు ప్రకటించాయి. కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఒలంపిక్స్‌లో దేశం తరఫున పథకాలు సాధించిన క్రీడాకారులను గౌరవిస్తూ పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కాగా ఒలింపిక్స్ లో భారత్ తరఫున పథకాలు సాధించిన క్రీడాకారులు తమ విమానాల్లో ఉచితంగా ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్లు ఇటీవలే దేశీయ విమానయాన సంస్థ అయిన ఎయిర్ పోర్ట్, గో ఫస్ట్ విమానయాన సంస్థలు ప్రకటించాయి.
అయితే ఇలా కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించాయి అనుకుంటే పొరపాటే.. క్రీడాకారులు జీవితకాలమంతా ఉచితంగా తమ విమానాలలో ప్రయాణించవచ్చు అంటూ ఇటీవలే స్టార్ ఎయిర్ విమానయాన సంస్థ తెలిపింది. మరో దేశీయ విమానయాన సంస్థ అయిన గో ఫస్ట్ ఐదేళ్లపాటు క్రీడాకారులు ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఇక అదే సమయంలో దేశానికి స్వర్ణ పతకాన్ని సాధించి త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన నీరజ్ చోప్రా కి ఏడాది పాటు ఉచిత ప్రయాణ సేవలు అందిస్తామని ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి