టీమ్ ఇండియా డేర్ అండ్ డాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఇక టీమిండియాను ఒంటి చేతితో గెలిపించగల సత్తా ఉన్న బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ. కానీ గత కొంత కాలం నుంచి ఏమైందో తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఫామ్ కోల్పోయి పేలవ ప్రదర్శన చేస్తున్నాడు విరాట్ కోహ్లి. ఎప్పుడు టీమిండియాను గెలిపించడంలో కీలకపాత్ర వహించే కోహ్లి ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా పేలవ ప్రదర్శనతో వరుసగా నిరాశపరుస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడూ.


 ఇటీవలే ప్రస్తుతం జరుగుతున్న మూడవ మ్యాచ్లో కూడా కోహ్లీ నిరాశపరిచాడు అనే చెప్పాలి. నేడు లీడ్స్ వేదికగా ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది భారత జట్టు. ఇక ప్రస్తుతం టాప్ ఆర్డర్ మొత్తం కోల్పోయి కష్టాల్లో పడింది. 21 పరుగులకే కె.ఎల్.రాహుల్, పూజారా, విరాట్ కోహ్లీ లాంటి కీలక వికెట్లను చేజార్చుకుంది. అయితే ఈ ముగ్గురిని అటు జేమ్స్ అండర్సన్ ఒకే తరహాలో వికెట్ తీసుకోవడం గమనార్హం. ఇక కోహ్లీ తన బలహీనతను మరోసారి చాటుకున్నాడు. తన వికెట్ కోల్పోయి పెవిలియన్ బాట పట్టాడు.



 ఇక ఇన్నింగ్స్ 11 ఓవర్ లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్ చేశాడూ. ఈ క్రమంలోనే  బ్యాట్స్మెన్ గా ఉన్న  కోహ్లీకి తన బలహీనతతో మరోసారి వికెట్ కోల్పోయాడు. ఆఫ్ స్టంప్ కి వెలుపలగా వెళ్తున్న బంతిని వెంటాడి విరాట్ కోహ్లీ కీపర్ కి క్యాచ్ ఇచ్చాడు. ఐదో స్టంప్ లైన్ పై బంతిని సంబంధించగా.. ఇక ఆ బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నం చేశాడు కోహ్లీ.  చివరికి బంతి బ్యాట్ ఎడ్జ్ కి తాకి నేరుగా బట్లర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పటికే ఇలా విరాట్ కోహ్లీ ని పలుమార్లు తన బౌలింగ్లో అండర్సన్  వికెట్ తీయడం గమనార్హం.  ఇలా విరాట్ కోహ్లీ బలహీనతను పట్టిన అండర్సన్  వరుసగా అతని వికెట్ తీస్తూనే వస్తున్నాడూ.

మరింత సమాచారం తెలుసుకోండి: