ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తిరుగులేని జట్టుగా కొనసాగుతుంది ముంబై ఇండియన్స్ జట్టు.  ఎందుకంటే ఇప్పటివరకు ఏకంగా ఐదు సార్లు టైటిల్ గెలిచిన ఏకైక నేతగా ముంబై ఇండియన్స్ జట్టు కొనసాగుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అటు ముంబై ఇండియన్స్ ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రతి సీజన్లో కూడా అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతోంది.  ఇక ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టును ఢీకొట్టే సరైన జట్టు లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే కొన్ని జట్లు అటు వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకు వచ్చినప్పటికీ చివర్లో తడబడుతూ చివరికి టైటిల్ నేర్చుకుంటున్నాయ్. కానీ అటు ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం సమిష్టి కృషితో ఎప్పుడూ అద్భుతమైన విజయాలను సాధిస్తూ దూసుకుపోతుంది.



 ఇక ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు కూడా ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఓపెనర్ దగ్గరనుంచి బౌలర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ పరుగుల వరద పారిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు వరకు సాధ్యం కాని రీతిలో ఐదుసార్లు విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్ జట్టు.  ఇక ఈ సారి కూడా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగింది అనే చెప్పాలి.  అయితే గత ఏడాది అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈసారి కూడా అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. దీంతో ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టైటిల్ గెలవడం పక్క అని అందరూ అనుకుంటున్నారు.



 అయితే ఇటీవలే ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఆరోసారి టైటిల్ తెలవకుండా అడ్డుకునే సత్తా కేవలం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కు మాత్రమే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఢిల్లీ కాపిటల్స్ లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని.. ముంబై చెన్నై అయినా కూడా అడ్డుకోగల శక్తి వాళ్ళకి ఉంది అంటూ చెప్పుకొచ్చారు  ఇప్పటికే ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది అంటూ చెప్పుకొచ్చారు. జట్టులో సీనియర్ స్పిన్నర్ అశ్విన్, కోచ్ రికీపాంటింగ్ జట్టుకు బలం  అంటూ చెప్పుకొచ్చాడు బ్రాడ్ హాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl