ఇక తమ భద్రతా వ్యవస్థను ప్రపంచ దేశాలు తక్కువ అంచనా వేస్తున్నాయని.. తమకు క్రికెట్ అంటే.. ఆట కంటే ఎక్కువేనని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. సెక్యూరిటీ కారణాలతో పాక్ లో ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు నిరాకరించిన కారణంగా అక్రమ్ స్పందించాడు. కివీస్ జట్టు టూర్ ను రద్దు చేసుకోవడం తీవ్ర నిరాశకు గురించేసిందన్నాడు. తమ దేశం నుంచి క్రికెట్ తరలిపోకుండా ఏదైనా చేయగలమని.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అక్రమ్ కోరాడు.
మరోవైపు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సైతం టూర్ రద్దు చేసుకోవడంపై పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా స్పందించారు. అవసరమైతే పాశ్చాత్య దేశాలు ఏకమవుతాయని.. పరస్పరం సహకరించుకుంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసీబీ నిర్ణయం చాలా నిరాశకు గురి చేసిందని తెలిపారు. అవసరమైన వేళ తమ క్రికెట్ బంధానికి ఇంగ్లండ్ బీటలు వేసిందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ పరిస్థితుల నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రతా సమస్య వల్ల పాకిస్థాన్ తో సిరీస్ ను న్యూజిలాండ్ రద్దు చేసుకొని వెళ్లిపోయింది. అయితే క్రిస్ గేల్ పాక్ కు మద్దతు ప్రకటించాడు.
ఇక న్యూజిలాండ్ మహిళా క్రికెట్ జట్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. బెదిరింపును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు న్యూజిలాండ్ ప్రభుత్వం తెలిపింది. మహిళా జట్టు బస చేసే హోటల్ దగ్గర.. మ్యాచ్ ఆడే గ్రౌండ్ దగ్గర సెక్యూరిటీని పెంచింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి