అయితే నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్లో హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆడుతాడు అని చాలామంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. హైదరాబాద్ ప్రస్తుత కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్, భువనేశ్వర్ కుమార్ గాయం కారణంగా ఈ మ్యాచ్లో ఆడలేదు. దాంతో వార్నర్ ఆడుతాడు అనుకున్నారు. కానీ అతనికి చోటివ్వక మనీష్ పాండేను ఈ మ్యాచ్లో కెప్టెన్ గా నియమిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఏడాది డేవిడ్ వార్నర్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి మధ్య ఏదో జరిగింది అని వస్తున్న వార్తలకు ఈ సంఘటన మరింత బలం చేకూర్చింది.
ఇక ఆఖరి మ్యాచ్ లో చోటు దక్కని వార్నర్ మ్యాచ్ ప్రారంభానికి కొంత సమయం ముందు తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. అందులో ఇన్ని రోజులు తనకు అండగా నిలిచి సపోర్ట్ చేసిన అభిమానులకు సరిపడా కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే తాను. తన కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా మిస్ అవుతాం అని అన్నాడు. అలాగే ఇన్ని రోజులు తమకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వార్నర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనిని చూస్తుంటే కనీసం హైదరాబాద్ జట్టు తరఫున ఆఖరి మ్యాచ్ కూడా ఆడ లేక పోతున్నానని బాధపడుతున్నట్లు వార్నర్ చెప్పకనే చెబుతున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి