ఆదివారం షార్జాలో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక పేసర్ లాహిరు కుమార, బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ ఇద్దరూ గొడవపడటంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. ఆట ప్రారంభ దశలో కుమార లిటన్‌ను అవుట్ చేయడంతో ఆదివారం ఇద్దరు ఆటగాళ్ల మధ్య వాగ్వివాదం జరిగింది. వాగ్వాదం మధ్య వారిద్దరూ సహచరులు అడ్డు పడటంతో విడిపోవలసి వచ్చింది. లిటన్ తన వికెట్ కోల్పోయిన తర్వాత పిచ్ నుండి దూరంగా వెళుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. దాంతో లాహిరు కుమార మ్యాచ్ ఫీజులో 25 శాతం అలాగే లిటాన్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించినట్లు ఐసీసీ ప్రకటించింది.

అయితే ఈ శ్రీలంక బౌలర్ మరియు బంగ్లాదేశ్ బ్యాటర్  ఇద్దరూ ఐసిసి నిబంధనల స్థాయి ప్లేయర్స్ మరియు ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే కుమారకు అతని మ్యాచ్ ఫీజులో జరిమానా తో పాటుగా ఒక్క డీమెరిట్ పాయింట్‌ను అందుకున్నాడు. దాస్‌ కూడా అతని మ్యాచ్ ఫీజులో % జరిమానా తో పట్టు ఒక్క డీమెరిట్ పాయింట్‌ను పొందాడు.

అయితే ఈ మ్యాచ్ లో ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీలకు చెందిన జవగల్ శ్రీనాథ్ దీని పై ఆంక్షలు విధించారు. ఇక కరోనా మధ్యంతర ఆట నిబంధనల ప్రకారం ఐసీసీ క్రికెట్ ఆపరేషన్స్ విభాగం దానిని ఆమోదించింది. ఇక కుమార మరియు దాస్ ఇద్దరూ తమ తమ నేరాలను అంగీకరించారు. దాంతో అధికారిక విచారణ లేకుండానే జరిమానా విధించింది ఐసీసీ. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: