టీ 20 వ‌రల్డ్ క‌ప్‌ సూపర్‌ 12   నేడు భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగనున్న సంగతి విధితమే.  దుబాయ్ వేదిక‌గా రాత్రి 7:30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌ నేపథ్యం లో టీమిండియా కెప్టె న్‌ విరా ట్ కో హ్లీ  ఆస క్తి కర వ్యాఖ్యలు  చేశారు.  కివీస్‌ తో మ్యాచ్‌ ను ఎలా గెలవాలనే దాని పై ఒక ప్రణాళిక రచించుకున్నామని స్పష్టం చే శా రు విరాట్‌ కోహ్లీ.  ఇక తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని...  హార్దిక్‌ పాండ్యా విషయంలో మాకు క్లారిటీ ఉంది. 

అతను ఫిట్‌గానే ఉన్నాడని కుండ బద్దలు కొట్టారు.  న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆడబోతున్నాడు.. కానీ బౌలింగ్‌ మాత్రం చేయడని... శార్దూల్‌ ఠాకూర్‌ తుది జట్టులోకి తీసుకొచ్చే విషయమై ఆలోచిస్తున్నామని చెప్పారు విరాట్ కోహ్లీ.  బ్యాటింగ్‌ లైనఫ్‌ బాగానే ఉండడంతో అందులో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని... ఇక పాక్‌ తో మ్యాచ్‌ లో జరిగిన పొరపాట్లను న్యూజిలాండ్‌పై జరగకుండా జాగ్రత్తపడతామని స్పష్టం చేశారు విరాట్‌ కోహ్లి.
కివీస్‌పై మ్యాచ్‌ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటామని చెప్పారు విరాట్‌ కోహ్లీ.


అయితే.. అటు  ఈ మ్యాచ్‌ నేపథ్యం లోనే  న్యూజిలాండ్ కి బ్యాడ్ న్యూస్ ఎదురే కాగా... ఇండియా కి మాత్రం గుడ్ న్యూస్ ఎదురైంది.  న్యూజిలాండ్ టీం లో ఇవాళ్టి మ్యాచ్ కు ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కానున్నారు.  గాయం కారణంగా పేసర్ లుకీ ఫెర్గుసన్, ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ మ్యాచ్ కి దూరం కానున్నారు.  గుప్తిల్ స్థానంలో టిమ్ సీఫెర్ట్ టీం లోకి రానుండగా.. టోర్నీ మొత్తానికి దూరమైన ఫెర్గుసన్.... ఇతని స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి రానున్నారు.  దీంతో టీమిండియా కు ఈ మ్యాచ్ లో బిగ్ అడ్వాంటేజ్ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: