అయితే అటు నిర్వాహకులు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు పలువురు సిబ్బంది చేసే తప్పిదాల కారణంగా బయో బబుల్ లోకి కరోనా వైరస్ ని ఎంట్రీ ఇవ్వడం లాంటి జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా బయో బబుల్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నాయి క్రికెట్ బోర్డులు. కొంత మంది ఆటగాళ్లను నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏకంగా నిషేధం విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ కూడా కఠిన నిబంధనల మధ్య జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టి-20 వరల్డ్ కప్ లో బయో బబుల్ రూల్స్ బ్రేక్ అయ్యాయి.
టి 20 ప్రపంచకప్ లి అంపైరింగ్ చేస్తున్న ఓ అంపైర్ పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆరు రోజుల పాటు నిషేధం విధిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మైకేల్ గ్రాఫ్ అనే అంపైర్ పై ఐసిసి ఈ చర్యలకు సిద్ధమైంది ప్రస్తుతం ఆటగాళ్లే కాదు అంపైర్లు కూడా హోటల్ గది దాటి బయట వ్యక్తుల ను కలిసేందుకు అనుమతి లేదు కానీ మైఖేల్ గ్రాఫ్ ఏకంగా నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా హోటల్ దాటి బయట వ్యక్తులు ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతనిపై ఆరు రోజుల నిషేధం విధించిన ఐ.సి.సి.. క్వారంటైన్ లో ఉంచి రోజు విడిచి రోజు అతనికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి