టీమిండియా వరుస పరాజయాలపై ఇంకా భారత క్రికెట్ లో చర్చ జరుగుతూనే ఉంది. టి20 వరల్డ్ కప్ ప్రారంభం ముందు వరకు కూడా ఎంతో దూకుడుగా ఆడిన టీమిండియా ఇక వరల్డ్ కప్ లో మాత్రం ఎందుకు పేలవా ప్రదర్శన చేస్తుంది అనేది మాత్రం ఎవరికీ అర్థం కాని విధంగా మారిపోయింది. ఎంతో దూకుడుగా ఆడే టీమిండియా ఆటగాళ్లు సింగిల్స్ తీయడానికి ఇబ్బంది పడటం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే పాకిస్తాన్తో ఓటమిని జీర్ణించుకోలేకపోవడంతో పాటు  ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు చేతిలో కూడా ఘోరపరాజయాన్ని అస్సలు ఊహించలేకపోయారు. పలు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు న్యూజిలాండ్ కు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.



 అయితే టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా ఉన్న రోహిత్ శర్మను ఓపెనర్గా పంపించకుండా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అనే చెప్పాలి. అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ అనుభవం లేని యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ఓపెనింగ్ పంపించాడు. అయితే ఇషాన్ కిషన్ పేలవా ప్రదర్శన చేశాడు  కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. ఆ తరువాత మరో ఓపెనర్ కె.ఎల్.రాహుల్ (18 ), రోహిత్ శర్మ (14), కెప్టెన్ కోహ్లి (9) పరుగుల సరిపెట్టుకున్నారు. దీంతో  టీమిండియా ప్రమాదంలో పడిపోయింది. ఇక రెండవ మ్యాచ్లో ప్రత్యర్థి న్యూజిలాండ్ ముందు కనీసం  టార్గెట్ ను కూడా ఉంచ లేకపోయింది టీమిండియా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.


 అయితే స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మని కాదని ఇషాన్ కిషన్ ను ఓపెనింగ్ పంపించడం పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కాగా ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ముందు రోజు రాత్రి సూర్యకుమార్ యాదవ్ వెన్నునొప్పితో బాధపడ్డాడు.. మ్యాచ్ ఆడేందుకు అతడు సిద్ధంగా లేడు. అలాంటి సమయంలో అతని స్థానాన్ని భర్తీ చేయగల సరైన ఆటగాడు ఇషాన్ కిషన్ మాత్రమే అని అందరం అనుకున్నాం. గతంలో ఇషాన్ కిషన్ కు భారత జట్టు తరఫున ఓపెన్ చేసిన అనుభవం ఉండటం పరిగణలోకి తీసుకున్నాము దీంతో అందరం కలిసి ఒక చోట చర్చలు జరిపాము. దీంట్లో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. అందరం కలిసి ఇషాన్ కిషన్ ను ఓపెనింగ్ పంపించాలి అని డిసైడ్ చేశాం అంటూ టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: