ఇక ఈ మ్యాచ్ తో విరాట్ కోహ్లీ కెప్టెన్సి శకం ముగుస్తోంది. అయితే విరాట్ కోహ్లీ తర్వాత టి20 లకు కెప్టెన్ అయ్యేది ఎవరు అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే టి20 లకు టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ పిక్స్ అయిపోయినట్లే అని కొంతమంది భావిస్తున్నారు. ఇక మరోవైపు బీసీసీఐ ఆలోచన ఏమై ఉంటుందా అన్న దానిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో అందరిలో కూడా దీనికి సంబంధించిన చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే తర్వాత టి20 టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరు అనే దానిపై ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్ అని అందరూ అంటుండగా విరాట్ కోహ్లీ మాటలతో కన్ఫర్మ్ అయిపోయింది. తన మాటలతో తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అని విరాట్ కోహ్లీ స్పష్టత ఇచ్చాడు. అద్భుత ఆటగాళ్లు ఉన్న జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తర్వాత కెప్టెన్ పై ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. గత కొద్దిరోజుల నుంచి జట్టు విషయాలు అన్నింటినీ కూడా రోహిత్ శర్మ చూసుకుంటున్నాడు. జట్టుతో సారథిగా తను అద్భుత సమయం గడపానని భారత జట్టు గురించి గర్వంగా ఉన్నాను అంటూ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి