దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక అలాంటి సమయంలో మొదట కాస్త నెమ్మదిగా ఆడినట్లు కనిపించిన డేవిడ్ వార్నర్ ఆ తర్వాత మాత్రం భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. భారీగా పరుగులు చేశాడు.. అయితే ఆస్ట్రేలియా జట్టు మాత్రం మరో వైపు నుంచి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇక ఎంతో దూకుడుగా ఆడిన డేవిడ్ వార్నర్ 49 పరుగుల వద్ద అవుటయ్యాడు. చివరికి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. పాకిస్తాన్ బౌలర్ షాదాబ్ వేసిన ఓవర్లో వార్నర్ ఆడిన బంతి కీపర్ చేతిలోకి వెళ్ళిపోయింది. దీంతో పాకిస్తాన్ ఫీల్డర్లు అందరూ ఎంతో కాన్ఫిడెన్స్ తో అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ వికెట్ ఇచ్చేసాడు.
ఇలాంటి సమయంలో ఇక మైదానంలో ఉన్న డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా మైదానం బయటకి వెళ్ళిపోయాడు. అయితే ఇక డేవిడ్ వార్నర్ అవుట్ అయిన బంతిని ఒకసారి అల్ట్రా ఏడ్జ్ లో చెక్ చేయగా.. బంతి బ్యాట్ కి ఎక్కడ తగిలినట్లు కనిపించలేదు. దీనికితోడు స్ట్రైక్ కూడా ఎంతో ఫ్లాట్ గా వచ్చింది. అంటే డేవిడ్ వార్నర్ నాటౌట్ అన్న మాట. అయితే అంపైర్ వికెట్ ఇవ్వగానే పెవీలియన్ చేరిన డేవిడ్ వార్నర్ కాస్త అక్కడ నిలబడి ఆలోచించి ఉంటే బాగుండేది అని ప్రస్తుతం అందరూ భావిస్తున్నారు ఒకవేళ డేవిడ్ వార్నర్ గ్రీస్ లో ఉండి ఉంటే ఇక ఆస్ట్రేలియా జట్టు ముందుగానే టార్గెట్ చేదించి ఉండేది అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి