నెల రోజుల పాటు ఎంతో ఆసక్తిగా సాగుతున్న పొట్టి ప్రపంచ కప్ కు ఆఖరి క్షణం వచ్చేసింది. ఈ రోజుతో 2021 ప్రపంచ కప్ టైటిల్ ను గెలుచుకునే జట్టు ఏదో తెలిసి పోనుంది. ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ రోజు ఏ జట్టు గెలిచినా చరిత్రే అవుతుంది. కానీ న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం మొదటి సారి వరల్డ్ కప్ నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. ఎందుకంటే ఇప్పటి వరకు న్యూజిలాండ్ జట్టు ఖాతాలో ఎటువంటి వరల్డ్ కప్ లేకపోవడం గమనార్హం. అందుకే ఈ టైటిల్ అయినా గెలిచి తమ ఖాతాలో ఒక టైటిల్ ను వేసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక్కడ ఇరు జట్లు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించుకోవాలి. మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం చలాయించినా కొన్ని సార్లు ఒక చిన్న పొరపాటు చేయడం వలన మ్యాచ్ ను దూరం చేసుకుంటారు. అయితే ఈ రోజు మ్యాచ్ ను మాత్రమే కాదు టైటిల్ ను సైతం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే మ్యాచ్ సాగుతున్నంత సేపు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అన్ని విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ లో ఎటువంటి పొరపాటు చేయకుండా జాగ్రత పడాలి. సెమీఫైనల్ మ్యాచ్ లలో జరిగినది మనము చూశాము.

కీలక దశలో ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ జట్లు ఒక్క క్యాచ్ వదిలేయడంతో ఓడిపోయారు. ఆ రెండు క్యాచ్ లు పట్టి ఉంటే ఇప్పుడు ఫైనల్ లో పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ లు ఉండేవి. కాబట్టి ప్రతి ఒక్క రన్, క్యాచ్ చాలా క్రూషియల్ గా మారుతుంది. మరి ఈ రోజు ఫీల్డింగ్ లో మెరుగ్గా ఉన్న జట్టునే గెలుపు వారించే అవకాశాలు ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: