న్యూజిలాండ్ జట్టు మంచి ప్రదర్శన చేసినప్పటికీ చివరికి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అయితే టీ20 ప్రపంచకప్ లో గెలిచిన జట్టు దగ్గరనుంచి సెమీ ఫైనల్లో ఆడిన జట్టు వరకు ఎంత ప్రైజ్ మనీ గెలుచుకున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తంగా టి20 వరల్డ్ కప్ లో ప్రైజ్ మనీ 42 కోట్ల రూపాయలు. ఇక టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుకు 16 లక్షల డాలర్లు అంటే 11కోట్ల 91 లక్షలు వచ్చాయి. సూపర్ 12 దశలో లీగ్ మ్యాచ్లో ఐదింటికి నాలుగు విజయం సాధించడంతో అదనంగా 1.2 కోట్ల మేర ఆస్ట్రేలియా జట్టు ప్రైస్ మనీ గెలుచుకుంది. రన్నరప్ న్యూజిలాండ్ జట్టుకు 8 లక్షల డాలర్లు అంటే ఐదు కోట్ల తొంబై ఐదు లక్షలు వచ్చాయి..
సూపర్ 12 లో నాలుగు మ్యాచ్లలో గెలిచినందుకు 1.2 కోట్ల రూపాయలు అదనంగా వచ్చాయి. ఇక గ్రూప్ వన్ నుంచి గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్కు చేరుకున్న పాకిస్తాన్ ఇంగ్లాండ్ జట్లకు చెరో 3 కోట్లు అందుకోగా సూపర్ 12 లో 4 మ్యాచ్ లు గెలిచిన పాకిస్తాన్ కు 4.5 కోట్లు.. నాలుగు మ్యాచ్ లు గెలిచిన ఇంగ్లాండుకు 4.2 కోట్ల రూపాయలు దక్కాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి