ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటికి టీమ్ ఇండియా బయలుదేరింది. ఆ సమయంలో హార్థిక్ పాండ్యా ను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు షాక్ ఇచ్చారని ఇక అతని వద్ద ఉన్న 5 కోట్ల రూపాయల విలువైన వాచ్ ను స్వాధీనం చేసుకున్నారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. వాచ్ విలువ దాదాపు 5 కోట్ల వరకు ఉంటుంది అంటూ టాక్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హార్దిక్ పాండ్యా అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పారు. ఇకపోతే ఇటీవల తనపై వస్తున్న వార్తలపై స్పందించారు యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.
దయచేసి తనపై తప్పుడు వార్తలు రాయొద్దు అంటూ కోరాడు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తన నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న వాచ్ విలువ 5 కోట్లు రూపాయలు కాదని 1.5 కోట్ల రూపాయలు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే దుబాయిలో చట్ట ప్రకారమే ఈ వాచ్ కొనుగోలు చేశా అంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఒక భారతదేశ పౌరుడిగా తాను చట్టాలను గౌరవిస్తా అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంలో అధికారులకు తన నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుంది అంటూ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇప్పటికే కస్టమ్స్ అధికారులకు కావాల్సిన అన్ని పత్రాలు సమర్పించా అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి