ఇకపోతే న్యూజిలాండ్ టీ-20 జట్టు ఇండియా పర్యటనకు రాగా.. ఈ జట్టులో కూడా కొనసాగుతున్నాడు బౌల్ట్. కాగా ఇటీవలే టీమిండియా తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో బాగా రాణించాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బౌలర్ బౌల్ట్ ఏకంగా భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ భార్యకు బహుమతి ఇచ్చాడు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు ఏకంగా సూర్యకుమార్ యాదవ్. అదేంటి న్యూజిలాండ్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ భార్యకు బహుమతి ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా. ఇంతకీ ఏం జరిగింది అంటే.. నిన్న న్యూజిలాండ్ భారత్ మధ్య ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగింది.
మొదట ఎంతో దూకుడుగా ఆడింది భారత జట్టు. కానీ ఆ తర్వాత మాత్రం కేవలం 16 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే మూడవ స్థానంలో వచ్చిన కుమార్ యాదవ్ కు అద్భుతంగా రాణించాడు. 40 బంతుల్లో 62 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 57 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వ సిక్సర్ కొట్టబోయాడుమ్. కానీ అది టైం కుదరక చివరికి మైదానంలో బౌల్ట్ చేతిలోకి వెళ్ళింది. కానీ ఆ క్యాచ్ ఒడిసి పట్టుకోలేకపోయాడు బౌల్ట్.. ఈ విషయంపై మ్యాచ్ అనంతరం స్పందించిన సూర్యకుమార్ యాదవ్ తన భార్య పుట్టినరోజు నాడు ఇచ్చిన బహుమతి ఇదే అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి