అతని పేరు మిస్టర్ 360.. అతను ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు అందరూ అప్రమత్తమై పోతారు. ఎందుకంటే ఎటు వైపు నుంచి కూడా బౌండరీ బాదుతారో కూడా అతనికే తెలియదు. ఇక బౌలర్లు అతనికి బౌలింగ్ చేయడానికి భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటేఅతడు బ్యాటింగ్ ధాటికి ఎక్కడ చెత్త రికార్డును తమ ఖాతలో చేరి పోతాయో అని. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించగల సత్తా అతని సొంతం. మొన్నటి వరకు ప్రపంచ క్రికెట్లో నెంబర్ 1 బ్యాట్స్ మెన్ గా కొనసాగిన అతను తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం కేవలందేశవాళి లీగ్ లలో మాత్రమే ఆడుతున్నాడు.



 అతను ఎవరో కాదు మిస్టర్360 గా ప్రపంచ క్రికెట్లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఎబి డివిలియర్స్. ప్రపంచ క్రికెట్ లో ఏబీ డివిలియర్స్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో అన్ని వైపులా  భారీ షాట్లు ఆడగల సత్తా ఎబి డివిలియర్స్ సొంతం. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు లో ఎన్నో ఏళ్ల పాటుస్టార్ క్రికెటర్ గా కొనసాగిన ఎబి డివిలియర్స్ ఒక్కసారిగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్లో కొనసాగుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇటీవలే అభిమానులందరికీ మరోసారి షాక్ ఇచ్చాడు ఎబి డివిలియర్స్. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం నేను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా.. పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ అయినప్పటి నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు స్వచ్ఛమైన ఆనందంతో హద్దులు లేని ఉత్సాహం తో క్రికెట్ ఆటను ఆస్వాదించాను అంటూ ఎబి డివిలియర్స్ తన పూర్తి స్థాయి రిటైర్మెంట్ కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియా లో పెట్టాడు. కాగా ఇక కీలక ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించడం తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd