టీమిండియాలో ఎన్నో రోజుల నుంచి స్టార్ ఆల్రౌండర్ గా కొనసాగిన హార్థిక్ పాండ్యా ఇటీవలే మాత్రం ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.భుజం గాయం నుంచి కోలుకుని మళ్లీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించి మళ్లీ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈక్రమంలోనే హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణిస్తాడు అని అందరూ భావించారు. భుజం గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యా పూర్తిగా బౌలింగ్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కనీసం బౌలింగ్ చేయడానికి ఎక్కడ ఆసక్తి చూపించడం లేదు హార్థిక్.


 మరోవైపు అటు బ్యాటింగ్ లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతు ఉండటం గమనార్హం. దీంతో బీసీసీఐ హార్థిక్ పాండ్యాను ఫిట్నెస్ నిరూపించుకోవాలి అంటూ నేషనల్ క్రికెట్ అకాడమీ కి పంపించింది. అయితే ఇటీవలే టీమిండియా మాజీ ఆటగాడు కపిల్ దేవ్ హార్దిక్ పాండ్యా ఆటతీరుపై స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ పాండ్యా కు ఆల్రౌండర్ అని పిలవడం ఆపేయాలి అంటూ కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు  హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయనప్పుడు అతనికి ఆల్రౌండర్ అంటూ ట్యాగ్ ఇవ్వడం వృధా అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే హార్దిక్ పాండ్యా కు ఆల్ రౌండర్ అన్న టాక్ వెంటనే తొలగించాలని వ్యక్తం చేశారు


 గాయం బారినపడి కోలుకున్న హార్థిక్ పాండ్యా ఒక్కసారి కూడా బౌలింగ్ చేయడం నేను చూడలేదు. ఆల్ రౌండర్గా జట్టులోకి తీసుకున్నారు. అతను తప్పకుండా బౌలింగ్ చేయాలి. కానీ అతడు మాత్రం బౌలింగ్ జోలికి అస్సలు వెళ్లడం లేదు. ఇది ఇలాగే ఉంటే అతడు బౌలింగ్ చేయడం పూర్తిగా మరచి పోతాడు. హార్దిక్ పాండ్యా ఇకపై బౌలింగ్ చేయాలి అంటే మాత్రం చాలా మ్యాచ్ లలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇటీవల టి20 వరల్డ్ కప్ లో కూడా ఆల్ రౌండర్ గా సెలెక్ట్ అయిన హార్దిక్ పాండ్యా  అంతలా రాణించలేకపోయాడు. ఐదు మ్యాచ్ల్లో కూడా కేవలం బ్యాటింగ్ కి మాత్రమే  పరిమితం అయ్యాడు హార్దిక్ పాండ్యా. కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే బౌలింగ్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: