ఎంతో కాలంగా ఇండియా గడ్డపై విదేశీ జట్లకు టెస్ట్ లను గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ స్పిన్ పిచ్ లు ఎక్కువగా ఉంటాయి. స్పిన్ ను ఎదుర్కొవాలన్నా? స్పిన్ తో అవతలి వారిని బోల్తా కొట్టించాలన్నా? ఇండియా తర్వాతే ఎవరైనా... ఇప్పుడు న్యూజిలాండ్ తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ కూడా ఇదే విధంగా కొనసాగుతోంది. టీ 20 సిరీస్ ను ఇండియాకు కోల్పోయిన న్యూజిలాండ్ కనీసం టెస్ట్ సిరీస్ ను అయినా గెలుచుకుని సగర్వంగా స్వదేశానికి వెళదామనుకున్నారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే ఆలా జరిగేలా లేదు. ఆరంభంలో దొరికిన అవకాశాన్ని న్యూజిలాండ్ ఆటగాళ్లు సరిగా వినియోగించుకోలేకపోయారు.

కివీస్ ఓపెనర్లు మొదటి వికెట్ కు 151 పరుగులు సాధిస్తే... మిగిలిన ఆటగాళ్లంతా కలిపి 145 పరుగులు చేశారంటే, ఇండియా బౌలర్లు ఏ విధంగా కట్టడి చేశారో అర్ధమవుతోంది. ఇండియా స్పిన్ ద్వయం అక్షర్ పటేల్ మరియు అశ్విన్ లు 8 వికెట్లు సాధించి కివీస్ పతనాన్ని శాసించారు. జడేజా మరియు ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీసుకుని పర్వాలేదనిపించారు. ఉదయం మనము అనుకున్న విధంగానే ఇండియాకు 51 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో ఇండియా గెలుపుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కివీస్ కు కనీసం 350 పరుగుల లక్ష్యం నిర్దేశిస్తే ఖచ్చితంగా వారిపై ఒత్తిడి తీసుకురావచ్చు. అంటే ఇండియా ఇప్పుడు 300 పరుగులు చేస్తే సరిపోతుంది.

పిచ్ స్పినర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో కివీస్ స్పిన్నర్లను సైతం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి ఒకవైపు వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేయాలి. పుజారా మరియు రహానేలు వేగంగా ఆడాల్సిన అవసరం ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో విఫలమైన విలియమ్సన్ మరియు టేలర్ లను తెలీగా తీసుకుంటే పొరపాటే అవుతుంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చే సత్తా వీరి సొంతం. మరి ఈ టెస్ట్ ఫలితం ఏమి అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: